క్యాన్సర్లకు చెక్ పెట్టే బెస్ట్ ఆహారాలు ఇవే.. డైట్‌లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

by Anjali |
క్యాన్సర్లకు చెక్ పెట్టే బెస్ట్ ఆహారాలు ఇవే.. డైట్‌లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి.. చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితినే క్యాన్సర్ అంటారు. మన జీవనశైలి, జన్యువులు.. మన చుట్టూ ఉన్న వాతావరణంలోని అనేక అంశాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయి. ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి.. మరణిస్తున్నారు.

క్యాన్సర్ బారీ నుంచి తప్పించుకోవాలంటే హెల్తీ డైట్, రెగ్యులర్‌గా వ్యాయమం, మద్యపానం, ధూమపానం అలవాటు మానుకోవడం వంటి జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలంటే నిపుణులు చెప్పిన పలు రకాల ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం..

* బెర్రీలు: యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీ పండ్లను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు.

* సిట్రస్ పండ్లు: ద్రాక్ష, నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. వీటిలో ఫైబర్, ఫోలేట్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు, సమ్మేళనాలు సిట్రస్ పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

* యాపిల్స్ బేరి: రోజుకొక ఆపిల్ తో పాటు బేరి పండును డైట్‌లో చేర్చుకుంట క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలను పుష్కలంగా ఉంటాయి.

* వెల్లుల్లి, ఉల్లిపాయలు: వీటినే అల్లియం కూరగాయలు అంటారు. క్యాన్సర్లపై పోరాడే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆర్గానో సల్ఫర్ సమ్మేళనాలు వీటిలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటాయి.

* చిక్కుళ్లు: గోరుచిక్కుడు, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయల్లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు క్యాన్సర్ నుంచి కాపాడుతాయి.

* క్రూసిఫెరస్ కూరగాయలు: బ్రకోలీ, స్విస్‌చార్డ్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల్లో గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి బలమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉండటంతో రొమ్ము, కడుపు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ వంటి క్యాన్సర్ల బారిన పడకుండా చేస్తాయి.

* హెర్బల్స్, మసాలా దినుసులు: ఒరేగానో, అల్లం వంటి హెర్బల్స్, పసుపు, రోజ్మెరీ, సుగంధ ద్రవ్యాలు క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ మసాలా దినుసులను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

* తాజా ఆకుకూరలు: పాలకూర, స్విస్‌చార్డ్, తోటకూర వంటి తాజా కూరగాయల్లో పోషకాలు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు క్యానర్స్ నుంచి రక్షిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed