- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NASA: సునీతా విలియమ్స్‌ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎన్నిడేస్ టైముంది.. టెన్షన్‌లో నాసా
దిశ, ఫీచర్స్: బోయింగ్ సంస్థ స్టార్ లెనర్ వ్యోమనౌకను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వ్యోమ నౌక భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్‌తో జూన్ 5 వ తేదీన అంతరిక్షానికి బయలుదేరింది. ఈ రొధసి యాత్ర ఫస్ట్ 8 రోజులు అనుకున్నారు. కానీ యాత్ర గడువును పెంచారు. వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక కారణాల దృష్ట్యా రోజులు గడుస్తున్నా నేటికీ వారు అంతరిక్షంలోనే ఉన్నారు. 28 థ్రస్టర్లకు గాను ఐదు వర్క్ చేయడం లేదు.
అంతేకాకుండా స్పేస్ క్రాఫ్ట్‌లోని సర్వీస్ మోడ్యుల్‌లో ఐదు చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతోందట. ప్రస్తుతం వీటికి సంబంధించిన మరమత్తులు చేస్తున్నారు. దీంతో బుచ్ విల్మోర్ అండ్ సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగి భూమి మీదకు వస్తారన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. మరో విషయం ఏంటంటే.. సునీతా విలియమ్స్ - బుచ్ విల్మోర్‌లు భూమి పైకి వచ్చేందుకు ఇంకా 18 రోజులు మాత్రమే ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో నాసా వర్గాల్లో ఆందోళన స్టార్ట్ అయ్యింది.
ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌కి సంబంధమున్న స్టార్ లైనర్ స్పేస్ షిప్, వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురావాలంటే వాటిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సరిగ్గా వర్క్ చేయాలి. వ్యోమ నౌక సేఫ్‌గా ప్రవేశించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.కాగా వీటిలో ఏమైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందట. అయితే ఈ కొన్నిడేస్‌లో ఈ పనులు పూర్తయ్యేలా లేవు. ఇప్పటికే వ్యోమగాములకు అంతరిక్షంలోనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం వారి హెల్త్ సెట్ అయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.