పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గుతోందా?.. స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌ టిప్స్ ఇవిగో..

by Dishafeatures2 |
పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గుతోందా?.. స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌ టిప్స్ ఇవిగో..
X

దిశ, ఫీచర్స్ : వైవాహిక బంధాన్ని పవిత్రమైనదిగా, అందమైనదిగా, అనిర్వచనీయమైన ఆనందంగా పేర్కొంటుంటారు పెద్దలు. పెళ్లైన కొత్తలో ప్రతి ఒక్కరూ తమ దాంపత్య జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగుతోందని భావిస్తుంటారు. కానీ కాలం గడిచే కొద్ది మొదట్లో ఉన్న ప్రేమ, ఉత్సాహం లేదని కూడా చెప్తుంటారు. దాదాపు అందరి జీవితాల్లో ఇది సాధారణంగా ఎదురయ్యే సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు. రిలేషన్ షిప్స్‌లో చిన్న చిన్న తగాదాలు, రోజువారి ఒత్తిళ్ల నడుమ ప్రేమ, రొమాన్స్ వంటివి గతంకంటే తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే ఇలాంటి పరిస్థితి శాశ్వతంగా ఉంటుందనో, పరిష్కారం లేనిదో మాత్రం కాదు. వైవాహిక జీవితంలో లవ్, రొమాన్స్ మిస్ కాకుండా లేదా మిస్ అయిన ఫీలింగ్స్ రాకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

* హాబిట్స్‌ను యాక్సెస్ట్ చేయడం : దాంపత్య జీవితంలో ప్రేమ అంటే కేవలం ఒకరికి నచ్చినట్లు ఉండటం, నచ్చిన పనులు చేయడం మాత్రమే కాదు. ఇద్దరి మధ్య అండర్ట్ స్టాండింగ్ ఉండాలంటున్నారు నిపుణులు. అలాగే చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం, సరదాగా ఉండటం, పార్టనర్‌లో వింత అలవాట్లు, నమ్మకాలను కూడా గౌరవించడం, హాబిట్స్ లేదా అలవాట్లను యాక్సెప్ట్ చేయడం వంటివి బంధాన్ని బలంగా ఉంచుతాయట.

* రొటీన్‌కు భిన్నంగా : పెళ్లైన కొత్తలో ప్రతిరోజూ ఎక్కువ సేపు మాట్లాడుకోవడం, టూర్లు, ఊర్లు తిరగడం, పార్కులు, మ్యూజియంలు, వివిధ కొత్త ప్రదేశాలను సందర్శించడం వంటివి చేస్తుంటారు. తర్వాత ఇది తగ్గిపోతుంది. కానీ అప్పుడప్పుడైనా రొటీన్‌కు భిన్నంగా కొత్తగా అనిపించేలా క్యాండిలైట్ డిన్నర్, కలిసి బయటకు వెళ్లడం, పార్కులో వాకింగ్ చేయడం, విహార యాత్రలకు వెళ్లడం వంటి సరదా సరదా పనులు వైవాహిక బంధంలో ప్రేమను రెట్టింపు చేస్తాయి.

* ప్రేమ సందేశాలు : చాలామంది ఈ రోజుల్లో అయితే పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి పెళ్లయ్యే దాకా ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకోవడం, లవ్ అండ్ రొమాంటిక్ మెసేజ్‌లు పెట్టుకోవడం చేస్తుంటారు. పెళ్లైన ఏడాదికో, రెండేళ్లకో ఈ పరిస్థితి లేకపోవడంతో ప్రేమ తగ్గిందని భావిస్తుంటారు. అయితే సరదాకో, సంతోషానికి అప్పుడప్పుడైనా వాటిని కంటిన్యూ చేయడం దంపతుల మధ్య బంధాన్ని బలపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు.

* సరదాగా ఉండటం : దాంపత్య జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చిన్న చిన్న తగాదాలు, సరదాలు కూడా ఉంటాయి. అయితే ఎక్కువ సమయం సరదాగా ఉండటానికే ప్రయత్నించాలట. అంతేకాకుండా భాగస్వామిని నవ్వించడం, పొగడటం వంటివి కూడా బంధాన్ని బలపరుస్తాయి. అలాగే ఇద్దరి మధ్య జరిగే రహస్యాలు, కుటుంబ విషయాలు బయట ఎవరికీ చెప్పకపోవడం, పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం కలిగి ఉండటం దాంపత్య జీవితంలో అన్నింటికంటే ముఖ్యమని, ఇది రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

Next Story

Most Viewed