సిగ్గుపడుతూ అలాంటి ఫోటో షేర్ చేసిన రష్మిక.. ఎవరికోసమో అంటున్న ఫ్యాన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-03 05:35:55.0  )
సిగ్గుపడుతూ అలాంటి ఫోటో షేర్ చేసిన రష్మిక.. ఎవరికోసమో అంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన ( Rashmika Mandanna ) గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం,నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది, గీతా గోవిదం సినిమాతో యూత్ క్రష్‌గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ.. నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ.. తాజాగా బ్లాక్ టీ షర్ట్ ధరించి, ఫేస్ కనిపించకుండా దాచేసిన కొన్ని సెల్ఫీ ఫోటోస్ షేర్ చేసింది. వాటికి క్యాప్షన్ ఇస్తూ.. మీపై మంచి ఫోకస్.. వెలుగు ఉందని మీకు తెలిసినప్పుడు.. లేదా సెల్ఫీలు తీసుకున్నప్పుడు మీరు చాలా సిగ్గుపడతారు.. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.. సిగ్గుపడుతూ చాలా క్యూట్‌గా ఉన్నావు రష్మిక.. ఎప్పుడూ అల్లరిగా,యాక్టివ్‌గా ఉండే నువ్వు కూడా సెల్ఫీ అంటే సిగ్గుపడి పోతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన కొందరు రష్మిక లవ్ సింబల్ షేర్ చేసింది.. తన క్రష్ కోసం అందుకే అంతలా సిగ్గుపడుతోంది అంటున్నారు. ఇక ఈ నటికి సంబంధించిన ఏదో ఒక రూమర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారంటూ అనేక పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తుంటాయి. మేము మంచి స్నేహితులం అని చాలా సార్లు వారు చెప్పుకొచ్చినా ఈ రూమర్స్‌కు బ్రేక్ పడటం లేదు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీవల్లి పాత్రలో మరింత కొత్తగా రష్మిక కనిపించనుందని టాక్.

Advertisement

Next Story

Most Viewed