దుబాయ్ వర్షాలు: స్కూళ్లు, ఆఫీసులు మూసివేత.. విమానాలు రద్దు

by Shamantha N |
దుబాయ్ వర్షాలు: స్కూళ్లు, ఆఫీసులు మూసివేత.. విమానాలు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఏఈని మరోసారి వర్షాలు వణికిస్తున్నాయి. గత నెలలో యూఏఈలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం అస్తవస్త్యం అయిన సంగతి తెల్సిందే. కాగా.. మరోసారి యూఏఈని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించాలని సూచించారు అధికారులు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు.

యూఏఈలోఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడటంతో.. ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మే 2 నుంచి గరిష్ఠంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇంటి నుండి పని చేయడానికి ఉద్యోగులను అనుమతించమని కంపెనీలను కోరింది. పార్కులు మరియు బీచ్‌లు మూసివేశారు. వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది యూఏఈ విపత్తు నిర్వహణ.

Advertisement

Next Story

Most Viewed