Breaking : వివేకా హత్యా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్

by Satheesh |   ( Updated:2024-05-03 05:38:06.0  )
Breaking : వివేకా హత్యా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. కాగా, వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరితో పాటు పలువురు హై కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న అవినాష్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు తాజా నిర్ణయంతో ఎన్నికల వేళ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న అవినాష్ రెడ్డి భారీ ఊరట దక్కిందనే చెప్పాలి. ఈ కేసులో మరో నిందితుడి వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది.

Advertisement

Next Story

Most Viewed