Black rice: బ్లాక్ రైస్‌తో అనేక ప్రయోజనాలు మీ సొంతం.. నిపుణులు చెప్పేవివే?

by Anjali |   ( Updated:2024-09-16 10:19:33.0  )
Black rice: బ్లాక్ రైస్‌తో అనేక ప్రయోజనాలు మీ సొంతం.. నిపుణులు చెప్పేవివే?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది బ్రౌన్ రైస్‌ తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలున్నవారు ఈ రైస్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే బ్రౌన్ రైసే కాకుండా బ్లాక్ రైస్ తీసుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఆరోగ్యానికి మంచిదేనా? హార్ట్ ఎటాక్, వెయిట్ లాస్ వంటి సమస్యలు దూరం అవుతాయా? మరీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

తెల్ల బియ్యం తినడం కన్నా బ్లాక్ రైస్ తినడం మేలని అంటున్నారు నిపుణులు. వైట్ రైస్ లో కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దీంతో బరువు పెరగడానికీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాగా నిపుణులు చెప్పిన బ్లాక్ రైస్ ప్రయోజనాలు తెలుసుకుందాం..

ఆంథోసైనిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లాక్ రైస్ దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. నల్ల బియ్యంలో విటమిన్ ఇ, ఐరన్ జింక్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బ్లాక్ రైస్ తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది.

నల్లబియ్యం షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. సడన్‌గా చక్కెర స్థాయిలను పెంచవు. కాగా ఈ రైస్‌ను షుగర్ పెషెంట్లు వరంలా పరిగణిస్తారు. ఫైబర్ పుష్కలంగా ఉండే నల్లబియ్యం ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఇవి గుండె పనితీరును ప్రోత్సహించడంలో చాలా మేలు చేస్తాయి.

వీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, భాస్వరం, కాల్షియం, రాగితో పాటు ఫ్లేవనాయిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. తద్వారా ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు.

బ్లాక్ తిన్నట్లైతే వృద్దాప్య సంకేతాలను తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ రైస్‌లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు బాడీ నుంచి విషాన్ని తీసేయడంలో ఎంతో మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో బాగా ఉపయోగపడతాయి. కాగా బ్లాక్ రైస్ తీసుకుంటే లాభాలే తప్ప నష్టాలేమి లేవంటున్నారు నిపుణులు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed