- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు కొనే పుచ్చకాయ మంచిదేనా.. రంగు, రుచిని ఇలా గుర్తించండి?
దిశ, ఫీచర్స్: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయను తింటుంటారు. వేసవిలో వాటర్ మిలన్ విరివిగా లభిస్తుంది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా.. వాటర్ మిలన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు హైపర్ టెన్షన్ ను అదుపులో ఉంచుతాయి. అయితే పుచ్చకాయ కొనే ముందు.. ఏది మంచిదో అని గుర్తించడం చాలా కష్టం. ఎలాంటి కాయ కొనాలి? ఏది మంచి టేస్ట్ ఉంటుంది? ఏది ఎర్రగా ఉంటుంది? అని సాధారణంగా గుర్తించలేం. అయితే కొన్ని లక్షణాలను బట్టి మంచి వాటర్ మిలన్ ను గుర్తించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుచ్చకాయలు చాలా రకాలున్నప్పటికీ జాతులు మాత్రం రెండే. ‘ఆడ, మగ’. ఆడ పుచ్చకాయ సన్నగా గుండ్రంగా ఉంటుంది. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆడ పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. మగ పుచ్చకాయలు గుజ్జు, నీరు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది పెద్దదిగా ఉన్న పుచ్చకాయనే కొనడానికి మొగ్గు చూపుతారు. పుచ్చకాయ రుచికి దాని పరిమాణంతో అస్సలు సంబంధం ఉండదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా పట్టుకున్నప్పుడు బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఎప్పుడైనా సైజులో ఎక్కువ బరువు ఉన్న పుచ్చకాయలను మాత్రమే కొనాలి.
ఇక చాలా మంది గ్రీన్ కలర్లో ఉండే వాటర్ మిలన్ తాజాగా ఉంటుందని భావిస్తారు. కానీ అలాంటి పుచ్చకాయ పూర్తిగా పక్వానికి రావు. నిజానికి పండిన పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇక పుచ్చకాయలపై తెలుపు, గోధుమ రంగు మచ్చలు ఉండడం గమనించే ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత టేస్టీగా ఉంటుంది. ఈ మచ్చలు పుచ్చకాయపై తేనెటీగలు వాలడం వల్ల ఏర్పడుతాయి. అలాగే వాటర్ మిలన్ తొడిమను చూసి కూడా రుచి గుర్తించవచ్చు. తొడిమ ఎండిపోయి ఉంటే బాగా పండినట్లు. పచ్చగా ఉంటే ఆ కాయ పండలేదని అర్థం చేసుకోవాలి. పుచ్చకాయను కొట్టినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తే ఆకాయ బాగా పండిందని గుర్తించాలి. శబ్దం రాకపోతే ఇంకా పండాలి అని అర్థం.
Read More..