- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరండాలో కూర్చొని స్మోక్ చేస్తే .. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందా?
దిశ, ఫీచర్స్: కొందరు వరండాలో లేదా గదిలో తెరిచిన కిటికీ పక్కన కూర్చొని స్మోక్ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తాము పీల్చే పొగ ఇంట్లోని కుటుంబ సభ్యులకు, పిల్లలకు ప్రమాదం కలిగించదని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదని, జస్ట్ ఒక నమ్మకం మాత్రమేనని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అంటోంది. వరండాలో, కిటికీ పక్కన ఎక్కడ కూర్చొని ధూమపానం చేసినా దాని ఎఫెక్ట్ పిల్లలపై, కుటుంబ సభ్యులపై పడుతుందని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ లీహ్(Laura) రోసెన్ చెప్తున్నాడు.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఇజ్రాయెల్ దేశంలో వరండాలు, కిటీల పక్కన కూర్చొని స్మోక్ చేసే అలవాటు ఉన్నవారి పిల్లలను కొంతకాలం పరిశీలించారు. వీరి నుంచి జుట్టు (తల వెంట్రుకలు) శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా ప్రతీ 10 మందిలో ఆరుగురు పిల్లల తల వెంట్రుకల్లో నికోటిన్ నమూనాలు ఉన్నట్లు కనుగొన్నారు. అంటే.. వరండా, కిటికీ వంటి ప్రదేశాలు పిల్లలు పొగాకు బారిన పడకుండా రక్షించలేవనే వాస్తవాన్ని ప్రజలు, ధూమపానం చేసే వ్యక్తులు గ్రహించాలని పరిశోధకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
నిజానికి పిల్లలు స్మోకింగ్ వల్ల ఏర్పడే పొగకు గురికాకుండా ఉండాలంటే.. పెద్దలు తమ ఇంటికి కనీసం 33 అడుగుల వ్యాసార్థం కలిగిన దూరంలో ఉండాలని, ఇక బహిరంగ ప్రదేశాల విషయానికి వస్తే వ్యక్తులకు మధ్య కనీసం 33 ఫీట్ల దూరం పాటించాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. అంతేగాక ఇజ్రాయెల్ చాలా వరకు వరండాలు లేదా వాకిళ్లు నివాసం ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటాయని, దీనివల్ల ఇక్కడ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎఫెక్ట్‌తో పిల్లలు, గర్భిణులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. ఇక ఇండియాతోపాటు వివిధ దేశాల్లోనూ కుటుంబంలోని పెద్దల స్మోకింగ్ అవాట్లతో పిల్లలు, మహిళలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సెకండ్ హ్యాండ్ పొగకు గురికావడంవల్ల నికోటిన్ శాతం పెరిగి వివిధ క్యాన్సర్లకు, మెంటల్ డిజార్డర్లకు, సంతానలేమి సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: