- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేరెంట్స్ డ్రింకింగ్ హాబిట్స్‌తో వ్యసనానికి గురవుతున్న పిల్లలు
దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లలు పెద్దలను చూడటం, గమనించడం, వారి మాటలను వినడం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. అనేక విషయాల్లో పేరెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. అలాగే తల్లిదండ్రుల మద్యపాన, ఆహారపు అలవాట్లు కూడా పిల్లలపై ప్రభావం చూపుతాయని మిచిగాన్ యూనివ్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరికీ మ్యదపాన వ్యసనం ఉన్నట్లయితే అది వారి పిల్లలకు సంక్రమిస్తుందని, దీంతో పాటు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు పిల్లలు బానిసలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మద్యపానం అలవాటు కలిగిన 2000 మంది తల్లిదండ్రులకు సంబంధించిన పదేళ్ల డేటాను పరిశోధకులు విశ్లేషించారు.
వాస్తవానికి ఐస్ క్రీం, ఫ్రైస్ అండ్ పిజ్జా వంటి అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఎక్కువ స్థాయిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి తరచూ తీసుకోవడంవల్ల సదరు వ్యక్తుల్లో ‘అడిక్టివ్ రెస్పాన్స్’ను ప్రేరేపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. గత అధ్యయనాలు కూడా ఆల్కహాల్ యూజ్ డిజార్డర్‌తో వ్యవహరించిన పేరెంట్స్ ద్వారా పిల్లల్లో ఆ వ్యసనం ప్రమాదకర స్థాయికి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మొత్తం మీద మద్యపానం అలవాటు కలిగిన తల్లిదండ్రుల కారణంగా పిల్లలు అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవాలనే కోరికతో వ్యసనానికి బానిసలవుతున్నారని, పైగా తరచూ ఫుడ్ తీసుకునే విధానంలో నియంత్రణ కోల్పోతారని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే మద్యపానానికి దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: మీ సోషల్ సర్కిల్‌ను లెక్కించగలరా? ప్రతి ఒక్కరూ 10 మంది గుడ్ ఫ్రెండ్స్‌ను కలిగి ఉంటారట