కిరిబాటి ద్వీపంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకంత పాపులర్ అయ్యాయో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-01-01 09:42:09.0  )
కిరిబాటి ద్వీపంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకంత పాపులర్ అయ్యాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కిరిబాటి.. ఈ ద్వీపం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని జరుగుతున్న వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్‌లో ఈ దేశం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఎందుకంటే 33 అటోల్‌లతో కూడిన ఈ సుందరమైన దేశానికి ఒక భౌగోళిక ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. ఈ ద్వీపం భూమధ్యరేఖకు సమీపంలో పసిఫిక్‌ సముద్రంలోకి విస్తరించి ఉంది. మిగతా దేశాలతో పోల్చితే ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ పొజిషన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. 1994కి ముందు ఇక్కడ కొత్త సంవత్సర వేడుకలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జనవరి ఫస్టున జరిగేవి కాదు.

కిరిబాటి భూభాగంలో తూర్పు వైపు 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా విస్తరించి ఉన్న భూ భాగంలో ఒక రోజు, ఆసియా ఖండం వైపు విస్తరించి ఉన్న మిగతా చోట్ల రోజు కొత్త సంవత్సర వేడుకలు జరిగేవి. కానీ 1994 తర్వాత ఒకే టైమ్ జోన్ కిందకు తెచ్చి, ప్రపంచ దేశాలతో సమానంగా ఒకేరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఇక్కడి ప్రజలు, పాలకులు వ్యూహాత్మక ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. గత రెండు మూడేళ్ల వరకు కూడా కొందరు ప్రజలు ఒకేరోజు వేడుకలు జరుపుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ 2024లో మాత్రం కిరిబాటి ద్వీపంలో నివసించే ప్రజలంతా జనవరి ఫస్టు రోజే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకొని ప్రపంచాన్ని ఆకర్షించారు. పైగా ఈ ఐస్ లాండ్స్‌లోని ప్రజలు తమ సంప్రదాయ వంటకాలైన కాల్చిన పంది మాంసం, క్రేఫిష్‌లు, కొబ్బరి సాప్ డ్రింక్స్‌తో ఉత్సాహ భరితమైన వాతావరణంలో కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేశారు.

Advertisement

Next Story