- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెక్సికోలో బొమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్టోరీలో భారీ ట్విస్టులు.. చదవాల్సిందే..!!
దిశ, ఫీచర్స్: డబ్బు కోసం వీధుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినందుకు మెక్సికోలోని కోహుయిలాలో పోలీసులు ఇటీవల కత్తి పట్టుకున్న ఒక చుక్కీ డాల్‌ను, దాని ఓనర్‌ను అరెస్టు చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియల్ కిల్లర్ వంటి రూపాన్ని కలిగి ఉన్న చుక్కీ, రెడ్ కలర్ హెయిర్‌తో అత్యంత భయంకరమైన సినీ పాత్రలలో ఒకటిగా ఉంది. దాని ఐకానిక్ క్యారెక్టర్, చిల్లింగ్ స్మైల్ కారణంగా వరల్డ్‌వైడ్‌గా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. కాబట్టి కొందరు డబ్బులు డిమాండ్ చేసేందుకు లేదా అడుక్కునేందుకు ప్రజలను భయపెట్టడానికి సరదాగా ఈ చుక్కీ డాల్‌ను యూజ్ చేస్తుంటారు. అలాంటి ఒక సంఘటనే ఈ మధ్య కూడా జరిగింది.
కోహుయిలాలో నివాసం ఉండే కార్లోస్ ఎన్ అనే వ్యక్తి పెద్ద చుక్కీ డాల్‌ను తన స్వార్థానికి యూజ్ చేయడం ప్రారంభించాడు. అది చాలాసార్లు ప్రజలపై కత్తితో దాడి కూడా చేసిందట. అయితే దాని యజమాని రిమోట్ ద్వారా ప్లే చేస్తూ ఇలా చేయిస్తున్నాడు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్నాడు. దాని భయంకరమైన రూపాన్ని, బిహేవియర్‌ను చూసి పలువురు భయభ్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేతిలో నిజమైన కత్తిని పట్టుకొని పరుగెడుతున్న చుక్కీని ఓ మహిళా పోలీసు అరెస్టు చేసింది. ఆ తర్వాత అసలేం జరుగుతుందని ఆరా తీసిన పోలీసులు.. దాని యజమానిని పట్టుకుని జైలుకు తరలించారు. పలువురు డాల్‌పై కేసు నమోదు చేయడంపై ఆశ్యర్యం వ్యక్తం చేస్తుండగా, దాని భయంకరమైన చర్యల గురించి మరికొందరు చర్చిస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది.