చనిపోయిన 23 నిమిషాలకు ప్రాణం పోసుకున్న బాలిక.. కానీ శరీరమంతా గాయాలతో..

by Sumithra |
చనిపోయిన 23 నిమిషాలకు ప్రాణం పోసుకున్న బాలిక.. కానీ శరీరమంతా గాయాలతో..
X

దిశ, ఫీచర్స్ : మరణానంతర ప్రపంచాన్ని ఎవరు చూశారు ? ఒక వ్యక్తి మరణానంతరం ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు ? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అయితే మరణానంతర ప్రపంచాన్ని చూశామని చెప్పుకునే వ్యక్తులు ప్రపంచంలో కొందరు ఉన్నారు. కొందరైతే ప్రకాశవంతమైన కాంతిని చూశామని, మరికొందరు దేవుణ్ణి చూశామని, ఆ తర్వాత మళ్లీ బ్రతికామని చెబుతారు. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఒకటి వార్తల్లో నిలుస్తోంది. ఆమె చనిపోయిందని, అంటే శ్వాస తీసుకోవడం లేదని, అయితే 23 నిమిషాల తర్వాత ఆమె తిరిగి బతికిందని వాదిస్తున్నారు. ఇంతకీ ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎక్కడ జరిగింది. దాని వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ అమ్మాయి పేరు ఇసాబెల్లా విల్లింగ్‌హామ్. ఆమె కెంటుకీలోని విల్మోర్‌లోని అస్బరీ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం 21 ఏళ్ల ఇసాబెల్లా హాస్టల్‌లో నివసించారు. ఇంతలో ఓ రోజు హఠాత్తుగా నేలపై పడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత కాసేపటికి శ్వాస ఆగిపోయింది. హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారట. అక్కడ అతన్ని క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచారు. అప్పటి వరకు ఊపిరి తీసుకోని బాలిక సరిగ్గా 23 నిమిషాల తర్వాత హఠాత్తుగా ఊపిరి పీల్చుకుందట. ఈ అద్భుతం ఎలా జరిగిందో వైద్యులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. గతేడాది నవంబర్ 27న ఈ ఘటన జరిగింది.

ఎలా గాయపడ్డారు ?

ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలిక శరీరం పై తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నాయి. అయితే ఇసాబెల్లా రూమ్‌మేట్‌కి గాని, హాస్టల్ వారికి గాని, ఇసాబెల్లాకు ఆ గాయాల గురించి తెలియదు. ఇసాబెల్లా కాళ్లు వాచి ఉన్నాయని, ఆమె శరీరమంతా కోతలు, గీతలు ఉన్నాయని అయితే దాని గురించి ఆమెకు ఏమీ తెలియదని పోలీసులు చెప్పారు.

ఇంకా వీడని మిస్టరీ..

ఇసాబెల్లా తండ్రి ఆండీ విల్లింగ్‌హామ్ మాట్లాడుతూ రాత్రి 11 గంటలకు హాస్టల్ వ్యక్తుల నుంచి తన కుమార్తెను ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు తనకు కాల్ వచ్చిందని, ఆమె తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించిందని చెప్పారు. ఈ వార్త విన్న తరువాత అతను ఆసుపత్రికి పరిగెత్తాడట. 23 నిమిషాల పాటు తన కుమార్తె శ్వాస ఆగిపోయిందని, ఆమె చనిపోయిందని తెలుసుకున్నాడు. కానీ ఆమె మళ్లీ బ్రతికింది. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాల గుర్తులకు సంబంధించిన వివరాలను ఎవరూ తెలపలేకపోయారు. దాదాపు రెండు వారాలు ఆసుపత్రిలో గడిపిన తర్వాత, ఇసాబెల్లా డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ గాయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed