- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jurrassic: జూరాసిక్ యుగం నాటి ‘జెయింట్ కీటకం’ మళ్లీ కనిపించింది !
దిశ, ఫీచర్స్ : అంతరించి పోయిందనుకున్న జూరాసిక్ (క్షీరదాల ఆవిర్భావకాలం)కాలం నాటి జెయింట్ కీటకం(giant insect) మళ్లీ కనిపించింది. తూర్పు ఉత్తర అమెరికాలో అర దశాబ్దం కాలంగా ఈ కీటకాలజాతి అదృశ్యమైంది. తాజాగా ఇక్కడి ఆర్కాన్సాస్‌లోని వాల్‌మార్ట్ గోడలపై ఒక పెద్ద బాక్స్ వంటి భాగంలో కనిపించింది. దీంతో జెయింట్ కీటకాల జనాభా అంతరించి పోకుండా ఓజార్క్ పర్వతాల మారుమూల ప్రాంతంలో దాగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే జూరాసిక్ లేదా డైనోసర్ యుగంలో అధికంగా ఉన్న లేస్ లివింగ్ జెయింట్ కీటకం(giant insect) తిరిగి కనిపించడంపై ప్రజల్లో, సైంటిస్టుల్లో ఆసక్తి నెలకొంది. ఉత్తర అమెరికాలోని అనేక పర్వత ప్రాంతాల్లో ఒకప్పుడు ఎక్కువగా కనిపించిన జెయింట్ కీటకాల జాతి, ఓజార్క్ పర్వతాల మారుమూల ప్రాంతాలలో దాగి ఉండవచ్చని ఊహాగానాలకు దారితీసింది.
పెన్ స్టేట్ ఇన్ సెక్ట్ ఐడెంటిఫికేషన్ ల్యాబ్ డైరెక్టర్ మైఖేల్ స్క్వార్లా తాను 2012లో అర్కాన్సాస్ యూనివర్సిటీలో డాక్టరల్ స్టూడెంట్‌గా (doctoral student) ఉన్నప్పుడు జెయింట్ కీటకాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నాడు. ‘‘నాకు స్పష్టంగా గుర్తుంది. ఎందుకంటే నేను మిల్క్ తెచ్చుకోవడానికి వాల్‌మార్ట్‌లోకి నడుస్తున్నాను. ఆ సమయంలోనే బిల్డింగ్ బయటి వైపున ఈ భారీ కీటకాన్ని చూశాను’’ అని స్క్వార్లా తెలిపాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందని ఆ కీటకాన్ని ఒక చేతిలో పట్టుకొని, మరో చేతితో మిల్క్ పట్టుకొని ఇంటికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతను దాని గురించి పట్టించుకోలేదని ‘ప్రోసీడింగ్స్ ఆఫ్ ది ఎంటమోలాజికల్ సొసైటీ ఆఫ్ వాషింగ్టన్’లో ఇటీవల పబ్లిషైన ఆర్టికల్‌లో స్క్వార్లా పేర్కొన్నాడు. 2020 చివరిలో కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో తాను జీవవైవిధ్యంపై స్టూడెంట్స్‌కు క్లాస్ చెప్తున్నప్పుడు జెయింట్ కీటకం ప్రస్తావన వచ్చింది. దీంతో 2012లో తాను పట్టుకున్న జెయింట్ కీటకాన్ని స్టూడెంట్స్‌తో పాటు కలిసి మైక్రోస్కోపిక్ ద్వారా పరిశోధనలు జరిపినట్లు తెలిపాడు. అది జూరాసిక్ యుగం నాటి కీటకమని, అర దశాబ్దంగా కనిపించకుండా పోయిందనుకున్న కీటకాన్ని తాను పట్టుకున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం ఎక్కడా కనిపించకుండా ఉన్న ఈ జెయింట్ కీటకజాతి ఓజార్క్ పర్వత ప్రాంతాల్లో ఉండవచ్చని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి : Black Spots: వీటితో బ్లాక్ స్పాట్స్ ఈజీగా మాయం చేయవచ్చు!