- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిప్రెషన్ డయాగ్నోసిస్‌లో కీలకం కానున్న ఏఐ.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన అనారోగ్యాన్ని నిర్ధారించే, అలాగే ట్రీట్మెంట్ అదించే విధానంలో విప్లవాత్మక మార్పులకు ఎనీటైమ్ రెడీగా ఉందని అమెరికా అండ్ ఆస్ట్రేలియన్ టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది డిప్రెషన్ డయాగ్నోసిస్‌లో అద్భుతంగా ఉపయోగపడుతోందని చెప్తున్నారు. వాస్తవానికి ఏఐ టూల్స్ ద్వారా బాధితుల్లో కచ్చితమైన రోగనిర్ధారణ చేయడం ఇటీవల వైద్య రంగంలో సాధ్యం అవుతోందన్న సంగతి మనకు తెలిసిందే. పైగా ఎటువంటి చికిత్సలు పనిచేస్తాయో గుర్తించడంలో ఇది డాక్టర్లకు హెల్ప్ అవుతుంది. ఇక జనాభాలో 20% మంది తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా డిప్రెషన్‌కు గురవుతారని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇలా ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మంది ప్రస్తుతం డిప్రెషన్‌ను అనుభవిస్తున్నారు. 1.5 మిలియన్ల మంది ఆస్ట్రేలియన్లు ఎప్పుడైనా నిరాశకు గురయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డిప్రెషన్ నిర్ధారణలో, చికిత్సలో ఏఐ కీ ఎలా హెల్ప్ అవుతుందనే అంశంపై టెక్ రీసెర్చర్స్ ఫోకస్ పెట్టారు. డిప్రెషన్‌ను గుర్తించడం అనేది దాని ఫ్రీక్వెన్సీని బట్టి టెస్టింగ్ మెథడ్స్ ఉన్నప్పటికీ ఇవి కచ్చితమైన నిర్ధారణను కష్టతరం చేస్తున్నాయి. వాస్తవానికి జనరల్ ప్రాక్టీషనర్స్ సగం కంటే తక్కువ కేసులలో మాత్రమే దీనిని కచ్చితంగా గుర్తిస్తున్నారు.
డిప్రెషన్‌కు ఎటువంటి కచ్చితమైన నిర్ధారణకు సంబంధించిన మెడికల్ టెస్టు లేదు. రోగనిర్ధారణ చేయడానికి డాక్టర్లు స్వీయ-నివేదిత లక్షణాలు, ప్రశ్నాపత్రాలు, క్లినికల్ అబ్జర్వేషన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. పైగా డిప్రెషన్ సింప్టమ్స్ అందరికీ ఒకేలా ఉండవు. కొంతమంది ఎక్కువ నిద్రపోవచ్చు, మరికొందరు తక్కువ నిద్రపోతారు. కొంతమందికి ఎనర్జీ అండ్ యాక్టివిటీస్‌పై ఇంట్రెస్ట్ ఉండదు. మరికొందరికి బాధగా లేదా చిరాకుగా అనిపించవచ్చు. వీటికి టాక్ థెరపీ, మెడికేషన్స్, జీవనశైలిలో మార్పులు వంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అయిన్పటికీ ట్రీట్మెంట్‌కు సంబంధించిన ప్రతిస్పందన ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. ఏ ట్రీట్మెంట్స్ ఎలా పని చేస్తాయి? ఏవి చేయవు? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవడానికి మార్గమేదీ లేదు. ఇక్కడే ఏఐ టెక్నాలజీ అవసరం ఏర్పడుతోందని నిపుణులు చెప్తున్నారు.
అధ్యయనంలో భాగంగా అమెరికా అండ్ ఆస్త్రేలియన్ టెక్నాలజీ నిపుణులు ఎంఆర్ఐ స్కానింగ్‌లు మొదలు ఫంక్షనల్ స్ట్రక్చర్ల వరకు 93 శాతం కేసులలో ఏఐ టెక్నాలజీ కచ్చితమైన అంచనాలు వేస్తున్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఏఐ టూల్స్ కంప్యూటర్లకు మానవుల మాదిరి ఆలోచించేలా ట్రైనింగ్ ఇస్తాయి. ఇందులో భాగంగా నేర్చుకోవడం, తార్కికంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వీయ-దిద్దుబాటు (కాలక్రమేణా పనితీరును చక్కగా మార్చడం, అలాగే మెరుగుపరచడం) వంటి మూడు మానవ ప్రవర్తలన మీద ఎనలైజ్ చేసి కచ్చితమైన సమాచారాన్ని పొందడం వైద్య నిపుణులకు ఏఐ టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతుంది. పైగా మల్టిపుల్ బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా ఇది పనిచేస్తుంది. అందుకే భవిష్యత్తులో డిప్రెషన్ నిర్ధారణ, చికిత్సలలో ఏఐ కీలకం కానుందని రీసెర్చర్స్ అంటున్నారు.