హనీమూన్ కు నేనూ వస్తా.. పట్టుబట్టిన అత్త..

by samatah |   ( Updated:2023-03-16 14:12:35.0  )
హనీమూన్ కు నేనూ వస్తా.. పట్టుబట్టిన అత్త..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లైన వారు ఏకాంతంగా గడపాలని చాలా ఆరాట పడుతుంటారు. కానీ కొన్ని ఉమ్మడి కుటుంబాలలో అది సాధ్యం కాదు. అయితే అలానే కొత్తగా పెళ్లి చేసుకొని, ఎప్పుడూ ఇద్దరూ వర్క్ బిజీలో ఉండటం నచ్చక, తన భర్తతో కలిసి ఏకాంతంగా గడపాలి అనుకుంది. అందుకోసం అదిరిపోయే ఫ్లాన్ వేసింది.. కానీ ఆమెకు తన అత్త బిగ్ షాకిచ్చింది. అయితే అసలు మహిళ ఏం ప్లాన్ వేసింది, తన అత్త ఇచ్చిన షాక్ ఎంటిది, ఆమె ఆసమస్యను ఎలా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం.

మహిళ మాట్లాడుతూ.. నాకు పెళ్లైంది, మా అత్తగారి ప్రవర్తన నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నేను, మా ఆయన ఎప్పుడూ వర్క్ బిజీలో ఉంటాం. అందువలన ఏకాంతంగా గడపడం కోసం హానీమూన్ ప్లాన్ చేశా, కానీ మా అత్తగారు కూడా మాతో వస్తాను అంటుంది. మా ఆయనకేమో ఇది ఫ్యామిలీ టూర్ కాదు అని చెప్పలేడు, నేను ఎలా ఆమెకు చెప్పాలో అర్థం కావడం లేదంటూ ప్రమఖ సారథి కౌన్సెలింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు, రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్ శివాని మిశ్రీ సాధు అడిగారు.

దానికి ఆయన సమాధానం ఇస్తూ..ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే.. మొత్తం కుటుంబాన్ని పెళ్లి చేసుకున్నట్లు అనే పాత సామెతను మీరు వినే ఉంటారు. ఇప్పటికీ భారత సమాజంలో.. వివాహ బంధంపై ఉన్న భావన అదే. మీరు మీ అత్తమామలతో ఉన్న సమయంలో కొన్ని సార్లు మీకు నచ్చని పనులు కూడా చేయాలి. ఆయినా మీ ప్రశ్నకు అందులోనే సమాధానం ఉంది. మీరు మీ భర్తతో కాస్త సమయం గడపాలని అనుకుంటున్నాను అని, మీ ఫీలింగ్స్ ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. మీ మనసులో ఉన్నదాన్ని చెప్పే ముందు ప్రేమగా మాట్లాడండి. ఆమె మీతో వస్తే మీ దృష్టి తనను చూసుకోవడం పైనే ఉంటుందని వివరించండి అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఈ విషయాన్ని మీ అత్తమ్మతో చర్చించే ముందు మీ భర్తతో ఒకసారి మాట్లాడండి అంటూ తెలిపాడు.

Also Read..

ఎంతకీ నిద్ర మేల్కోవడం లేదా.. అది ‘డైసానియా’ కావచ్చు!

Advertisement

Next Story