తెలంగాణ పాలిసెట్-2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

by Kavitha |
తెలంగాణ పాలిసెట్-2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్: నేడు తెలంగాణ పాలిసెట్ -2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మే 24వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా పాలిసెట్ -2024 రాసిన విద్యార్థులు తమ ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ నుంచే ర్యాంక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాక.. హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ ఆఫ్షన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది. అప్పుడు దానిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కాగా తెలంగాణ పాలిసెట్ -2024 కౌన్సిలింగ్ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 22వ తేదీ నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. అలాగే జూలై 7వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. జులై 13న సీట్లను కేటాయిస్తారు. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతుండగా.. 24వ తేదీ లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed