- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవ్వొత్తులతో మెరిసిపోతున్న ఇయర్ రింగ్స్.. ధర రూ.150 కన్నా తక్కువే!!
దిశ, ఫీచర్స్: మగువల అందాన్ని ఇనుమడింప జేసే అలంకరణల్లో ఇయర్ రింగ్స్ పాత్ర తక్కువేమీ కాదు. తమ తమ ఆసక్తి, అభిరుచులను బట్టి కొందరు స్ట్రట్స్ మాత్రమే ధరిస్తే మరికొందరు పొడవాటి జుంకాలు, రింగ్స్ ధరిస్తుంటారు. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త బ్రాండ్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు మరికొందరు. అయితే ఇయర్ రింగ్స్‌లో కొత్త రకాలు, కొత్త బ్రాండ్‌లు వస్తుండటం సహజమే. కానీ ప్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా కొవ్వొత్తి ఆకారాన్ని పోలిన లైట్-అప్ షాన్డిలియర్ ఇయర్ రింగ్స్‌ను రూపొందించింది యూపీకి చెందిన టాలెంటెడ్ టెక్నికల్ డిజైనర్ అండ్ ఆర్టిస్ట్ డయానా కాల్డరెస్క్.
స్టయిలిష్ అండ్ ఫ్యాషనబుల్
డయానా డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ లోబ్‌ల నుంచి షాన్డిలియర్స్ (కొవ్వొత్తుల ఆకారం) వేలాడుతూ అందంగా చూడ ముచ్చటగా కనిపిస్తాయి. చిన్న CR1632 బ్యాటరీని ఉపయోగించి రూపొందించిన ఈ ఇయర్ రింగ్స్ ఎంతకాలం మనగలుగుతాయో తెలీదు కానీ స్పెషల్‌గా ఉంటాయనేది మాత్రం సుస్పష్టం. మరో విషయం ఏమిటంటే ఈ లైట్అప్ షాన్డిలియర్ బ్యాటరీ రీప్లేస్‌కు అవకాశం ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లో పెరిగిన డయానా చుట్టు పక్కల ఉన్న సినిమా థియేటర్లలో తరచూ ఓల్డ్ మూవీస్ చూసేందుకు వెళ్తుండేది. అప్పటి ఆసక్తి, అనుభవాలే ఆమెను అద్భుతమైన లైట్అప్ షాన్డిలియర్ ఇయర్ రింగ్స్‌ను రూపొందించడానికి దోహదం చేశాయి. తన ఓన్ వెబ్‌సైట్ Etsy వేదికగా సేల్ చేస్తున్న ఒక జత ఇయర్ రింగ్స్ ధర రూ. 128 నుంచి రూ.158 వరకు ఉండగా.. భారీగా అమ్ముడయ్యాయి.
ఇవి కూడా చదవండి : గూగుల్‌లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్!