పెట్ డాగ్స్‌ను వాకింగ్ తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త!

by Jakkula Samataha |
పెట్ డాగ్స్‌ను వాకింగ్ తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : పెట్ డాగ్స్ అంటే చాలా మందికి ఇష్టం. ప్రతీ ఒక్కరు ఇంట్లో ఒక డాగ్ లేదా క్యాట్ ను పెంచుకుంటూ ఉంటారు. ఇక వాటితో సరదాగా ఆడుకోవడమే కాకుండా, వాకింగ్‌కు తీసుకెళ్లడం, పార్క్‌లోకి తీసుకెళ్లి వాటితో ఆడుకోవడం లాంటిది చేస్తుంటారు. అయితే కొంత మంది పెట్ డాగ్స్‌ను ఉదయాన్నే వాకింగ్ తీసుకెళ్లి, అక్కడే అవి మోషన్ పాస్ చేసేలా చేస్తుంటారు. అయితే అలా బయట పెట్ డాగ్స్ మల విసర్జన చేయడం వలన దాని నుంచి మానవులకే కాకుండా, ఇతర జంతువులకు కూడా వివిధ రకాల అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ ఉన్నది అంటున్నారు పరిశోధకులు. అందువలన పెంపుడు జంతువుల యజమానులు అవి పార్క్స్ లేదా రోడ్లపై మోషన్ పాస్ చేసేలా చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

పెంపుడు జంతువులు కాలి బాటలో లేదా పార్క్‌ల్లో వదిలేసిన వ్యర్థాల్లో ప్రాణాంతక పర్నాజీవులు ఉంటాయంట. ఇవి ఈజీగా మనుషులకు వ్యాప్తి చెందుతాయంట. ఇది అన్ని వయసుల వారిపై దాని ప్రభావం చూపుతుందని ఓ సర్వేలో తేలింది. 2020లోని యునైటెడ్ స్టేట్స్‌లోని ఆఫ్ లిష్ డాగ్ పార్క్‌లో పేగు వ్యాధులకు సంబంధించిన ప్రాణాంతక వైరస్ కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అవి ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సోకుతున్నాయంట. ఆ వైరస్ మన చేతి నుండి ముఖం, చెమట ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందంట. దీంతో దగ్గు, ఊపిరితిత్తుల సమ్యస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అలాగే ఈ వైరస్ జీర్ణవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఈ డేంజరస్ వైరస్ వ్యక్తి శరీరంలోకి వెళ్లడం వలన రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, చర్మసమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట.అలాగే పెంపుడు జంతువుల వ్యర్థం చిన్న పిల్లల్లో పేద్ద పేగు‌లో సమస్యలకు కారణం కావచ్చునని, అందువలన యజమానులు తమ పెట్ డాగ్స్ వ్యర్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

Next Story