Swiggy:స్విగ్గీ స‌రికొత్త నిర్ణ‌యం.. డ్రాగ‌న్ల‌తో ఫుడ్ డెలివ‌రీ!

by Sumithra |   ( Updated:2023-06-13 14:07:29.0  )
Swiggy:స్విగ్గీ స‌రికొత్త నిర్ణ‌యం.. డ్రాగ‌న్ల‌తో ఫుడ్ డెలివ‌రీ!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇటీవ‌ల‌ డిస్నీ+ హాట్‌స్టార్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌'కి ప్రీక్వెల్ అయిన 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సిరీస్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అది సరే, ఇప్పుడు ఇవే డ్రాగన్‌లు మీ దారిలో కూడా క‌నిపించ‌బోతున్నాయి. ప్ర‌ముఖ ఫుడ్ డెల‌వ‌రీ సంస్థ‌ స్విగ్గీ ఆ బాధ్య‌త తీసుకుంది. ఈ స‌రికొత్త సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా, Swiggy దాని డెలివరీ ట్రాకింగ్ ఇంటర్‌ఫేస్‌లో మోటార్‌సైకిల్‌పై ఉన్న వ్యక్తిని చూపించే సాధారణ చిహ్నం స్థానంలో ఇక నుండి డ్రాగన్‌ను చూపించ‌నుంది. Swiggy ఆర్డర్ ట్రాకింగ్ స్క్రీన్‌పై డ్రాగన్ మీ ఫుడ్ డెల‌వ‌రీ స్టేట‌స్ చూపిస్తుంది. దీనికి సంబంధించి స్విగ్గీ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను పంచుకుంది. ఇప్ప‌టికే, ట్రై చేసిన వినియోగ‌దారులు డ్రాగ‌న్‌తో వారి అనుభ‌వాలు, అనుమానాల‌ను పంచుకుంటున్నారు.

Advertisement

Next Story