- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇతరులు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా?.. ఇవి కారణం అయ్యుండవచ్చు!
దిశ, ఫీచర్స్: తరచూ తిరస్కరణకు గురవడం, ఇతరులు తనను అసహ్యించుకోవడం అనేది ఒక వ్యక్తికి బాధను కలిగించవచ్చు. కానీ ఎందుకలా జరిగిందో తెలియకపోతే అది దీర్ఘకాలంపాటు కొనసాగుతుందని, అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. 2,000 మంది అడల్ట్స్‌పై ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ వన్‌పోల్ నిర్వహించిన ఒక కొత్త స్టడీ పేర్కొన్నది. 65 శాతం మంది వ్యక్తులు అకస్మాత్తుగా రిలేషన్‌షిప్‌లో విడిపోవడానికి, అలాగే కొందరు ఇతరుల ద్వారా ఆయా సందర్భాల్లో తిరస్కరించబడటానికి గల కారణాలను వెల్లడించింది.
పలువురు తమ భాగస్వామితో విడిపోవడానికి గల విచిత్రమైన కారణాలలో గోర్లు మురికిగా ఉండటం, వెయిటర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం, అసహ్యకరమైన టాటూలు కలిగి ఉండటం, నోటి దుర్వాసన, ఎప్పుడూ భాగస్వామినే అంటి పెట్టుకుని ఉండటం వంటివి కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతీ ఏడుగురిలో ఒకరు ఫస్ట్ డేట్‌రోజు ఆహారాన్ని పంచుకోవాలనుకునే ప్రపోజ్‌వల్ల తిరస్కరణకు గురవుతున్నారు. 16 శాతం మంది అట్రాక్షన్ లేని, చెడిపోయిన వాచ్ ధరించడంవల్ల ఇతరుల ద్వారా తిరస్కరించబడుతున్నారు. 15 శాతం మంది తమ ఫేవరెట్ స్పోర్ట్స్ టీమ్‌ను పరిగణించే విషయంలో తాము కూడా జట్టులో జడ్జ్‌మెంట్ చేయడంవల్ల తిరస్కరణకు గురవుతున్నారు.
మూఢనమ్మకాలు, అతిజోక్యాలు
చేతబడి చేస్తే చనిపోతారని, జ్యోతిష్యం పనిచేస్తుందని లేదా నిజం అవుతుందనే మూఢనమ్మకాలను కలిగి ఉండటంవల్ల 48 శాతం మంది తిరస్కరించబడుతున్నారు. ఈ పరిస్థితి అమెరికా, చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లో అధికంగా ఉంది. ఇక భారతదేశంలో 31 శాతం మంది ఎడ్యుకేటర్స్ కూడా మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఆరుగురిలో ఒకరు జ్యోతిష్యం, రాశులు, నక్షత్రాలు, ముహూర్తాలు బాగాలేవని శృంగారానికి అడ్డు చెప్పడంవల్ల తమ భాగస్వామితో తిరస్కరించబడుతున్నారట. 79 శాతం మంది భాగస్వాములు నోటి దుర్వాసన కారణంగా, 35 శాతం మంది డేటింగ్ డీల్ బ్రేకప్ వల్ల తరిస్కరించబడుతున్నారు. 14 శాతం మంది విమానం ల్యాండ్ అయినప్పుడు చప్పట్లు కొట్టడంవల్ల రిజెక్ట్ చేయబడుతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అరుదుగా నిజాయితీగా ప్రేమించేవారు, భాగస్వామితో ఎన్నడూ గొడవ పడకుండా తరచూ అతి జాగ్రత్తగా చూసుకునేవారు కూడా తిరస్కరించబడేవారి జాబితాలో ఉన్నారు. దీంతోపాటు అతి చొరవ, ఎదుటి వారి ప్రతీ విషయంలో జోక్యం చేసుకోవడం, కలిసినప్పుడల్లా ‘డబ్బులు జాగ్రత్తగా దాచుకో, నీ జీతం ఎంత? పిల్లలు ఎంతమంది?’ అని ప్రశ్నలు వేసేవారిని కూడా భారతదేశంలో 24 శాతం మంది తిరస్కరిస్తారని సర్వేలో వెల్లడైంది. ఇక కర్చీఫ్ అడ్డు పెట్టుకోకుండా తుమ్మడం, ఆవులించడం, నలుగురిలో ఉన్నప్పుడు ముక్కులో వేలు పెట్టుకోవడం, నోరు తెరచి నమలడం, వాటర్ బాటిల్ లేదా గ్లాసులో నీళ్లు తాగుతున్నప్పుడు నోటికి ఆనించి తాగడం, హెవీ మేకప్ వేసుకోవడం, అసహ్యకరమైన జీన్స్ ధరించడం, చెప్పులు వేసుకొని ఇంట్లో నడవడం వంటివి అత్యధిక మంది తిరస్కరించుకోవడానికి కారణం అవుతున్నాయి.
Read more :
అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఏడుస్తారట.. సర్వేలో వెల్లడి
10 నిమిషాల కంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే