వాయు కాలుష్యమున్న ప్రాంతాల్లో ఆత్మహత్యలు కామన్..?

by Prasanna |   ( Updated:2022-12-16 13:23:14.0  )
వాయు కాలుష్యమున్న ప్రాంతాల్లో ఆత్మహత్యలు కామన్..?
X

దిశ, ఫీచర్స్: ఎయిర్ పొల్యూషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆత్మహత్యలు సాధారణమైపోయే అవకాశం ఉందని ఓ తాజా అధ్యయనం హెచ్చరించింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో పబ్లిష్ అయిన ఈ రకమైన ఫస్ట్ లార్జ్ స్కేల్ స్టడీ..2003 నుంచి 2010 మధ్య USలో జరిగిన మరణాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించింది. గాలిలో ఉండే చిన్న రేణువులు PM 2.5 (ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్) ఇందుకు కారణమని తెలిపిన శాస్త్రవేత్తలు..ఊపిరితిత్తుల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించగల ఈ సూక్ష్మ రేణువుల పదార్థం..ఒక క్యూబిక్ మీటరుకు ఒక మైక్రోగ్రాము అణువులు రోజువారీ ఆత్మహత్యలలో దాదాపు 0.5 శాతం పెరుగుదలతో ముడిపడి ఉందని వివరించారు. ఇక నెలవారీ PM 2.5 పెరుగుదల..ఆత్మహత్యా యత్నంతో ఆస్పపత్రిలో చేరిన పేషెంట్ల సంఖ్యలో 50 శాతం పెరుగుదలతో లింక్ అయి ఉంది.

ఎందుకు ప్రమాదకరం?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వాయు కాలుష్యంవల్ల ఏటా 7 మిలియన్‌ల వరకు అకాల మరణాలు సంభవిస్తున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని పెంచడంతో పాటు గర్భంలోని పిండం అభివృద్ధిపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. మెదడు ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. PM 2.5 ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రొడక్టివిటీ, స్ట్రాటెజిక్ చాయిసెస్, అకాడమిక్ పర్ఫార్మెన్స్‌, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

వాయు కాలుష్యం, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం బయోలాజికల్ ఎక్స్‌ప్లనేషన్‌ను కలిగి ఉంది. సూక్ష్మ రేణువులకు ఎక్స్‌పోజ్ కావడంవల్ల సైటోకిన్‌ ప్రోటీన్‌ల స్థాయిలు బాగా పెరిగి ఇమ్యూన్ సిస్టమ్‌ను ఓవర్ డ్రైవ్ చేస్తాయి. ఇది కాస్తా ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయగా.. ప్రతిస్పందనగా ఉత్పత్తి అయిన న్యూరోట్రాన్స్‌మిటర్‌లు నిరాశ, ఆత్మహత్యలతో సంబంధం కలిగి ఉంటాయి. కాలుష్యం మెదడు వాపుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మూడ్ రెగ్యులేషన్ కంట్రోలింగ్‌కు అంతరాయం కలిగించవచ్చు.

పరిశోధనల్లో ఏం తేలింది?

వాషింగ్టన్ DCలోని అమెరికన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పెర్సికో అండ్ మార్కోట్ మానసిక స్థితిపై వాయు కాలుష్యం యొక్క ప్రభావాన్ని మరింత లోతుగా అన్వేషించారు. ప్రాంతాల వారీగా ఆత్మహత్య గణనలపై రోజువారీ డేటాను గాలి నాణ్యత డేటాతో సరిపోల్చారు. కాలుష్యం బహిర్గతం కోసం గాలి దిశను సాధనంగా ఉపయోగించారు. స్థానిక నిరుద్యోగం, జనాభా, వాతావరణం, సెలవులు, ప్రాంతం, నెల, వారం బేస్ చేసుకుని అధ్యయనం నిర్వహించారు. రోజువారీ ఆత్మహత్యల రేటు, నెలవారీ ఆత్మహత్య-సంబంధిత ఆస్పత్రిలో రోగుల పెరుగుదలను కనుగొనడంతోపాటు.. PM 2.5 స్థాయిలు ఎక్కువగా డిప్రెషన్ లక్షణాలతో ముడిపడి ఉన్నాయని అధ్యయనం కనుగొంది.

Advertisement

Next Story

Most Viewed