- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే సక్సెస్ మీ సొంతం!
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ ప్రయత్నించేది సక్సెస్ కోసం. పాజిటివ్ థింకింగ్, హార్డ్ వర్క్ ఉన్నవారిని విజయం అనేది వరిస్తుంది.అయితే కొంత మంది ఎంత కష్టపడినా వారు లైఫ్‌లో సక్సెస్ కాలేరు. కానీ కొంత మంది మాత్రమే ఈజీగా సక్సెస్ అవుతారు. అయితే దీనికి కారణం వారిపై వారికి ఉన్న నమ్మకమే. మనం ఏదైతే అనుకుంటామో, దానిని సాధించాలనే పట్టుదల ఉండాలి. దానికోసం ఓ పోరాటమే చేయాలి. అయితే విజయం అందుకునే వారిలో ఈ మూడు లక్షణాలు ఉంటే వారు త్వరగా తమ లైఫ్‌లో సక్సెస్ అవుతారంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓర్పు : ప్రతి మనిషికి ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి.మనం ఏ పని చేసినా అందులో త్వరగా విజయం వస్తుందా అంటే అది జరగని పని, ఒక సక్సెస్ అందుకోవాలంటే, ఎన్నో ఫెల్యూర్స్ చూడాలి. వాటన్నింటిని దాటుకుంటేనే సక్సెస్ అవుతారు. అందువలన విజయం కోసం ఓర్పుగా ఉండాలి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీపిగా ఉంటుంది. ఆ తీయదనం మీకు కావాలంటే ఓర్పుగా విజయం కోసం పనిచేయాలి. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా ఓర్పుతో ఉండటం మంచి లక్షణం.
గెలుపే లక్ష్యం : కొంత మంది సక్సెస్ కోసం చేసే ప్రయత్నంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎన్నో అడ్డంకులు వారికి ఎదురు అవుతాయి. అయితే వాటికి భయపడి మీ పోరాటాన్ని ఆపకూడదు. విజయాన్ని అందుకునే ప్రయాణంలో తొలి పరాజయం రాగానే చేసే పనిని వదిలి పారిపోవద్దు. ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని ఆ ఓటమే చెప్తుంది. అందువల్ల దేనికి భయపడకుండా, శ్రద్ధగా నీ పని నువ్వు చేస్తూ పోవడం వలన విజయం నీ సొంతం అవుతుంది.
మీ కంటూ కాస్త సమయం : సక్సెస్ కావాలానే ఆశతో మిమ్మల్ని మీరు కోల్పోకూడదు. రోజూలో కొంతైనా మీ కోసం మీరు సమయం కేటాయించుకోవాలి.కాసేపు స్నేహితులతో కలిసి సరదాగా గడపాలి. మీకు ఇష్టమైన ప్లేస్‌కు వెళ్లి పదినిమిషాలు కూర్చోవడం, మీకు నచ్చిన వారితో మాట్లాడటం చేయాలి. దీని వల్ల మీ మైండ్ ఫ్రెష్ అయ్యి, పట్టుదల మరింత పెరుగుతోంది.