లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయరు?

by sudharani |   ( Updated:2023-06-10 14:34:43.0  )
లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయరు?
X

దిశ, ఫీచర్స్: లైంగిక వేధింపులకు గురైనప్పుడు చాలా మంది అమ్మాయిలు వెంటనే ప్రతిస్పందించరు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. దీని వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. బాధితులు న్యాయం యొక్క అవసరం కన్నా భద్రత, వ్యక్తిగత నియంత్రణ, సామాజిక మద్దతు, ఇతర అవసరాలను ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారని గుర్తించారు. తమ అనుభవాలను అధికారికంగా నివేదించకపోవడానికి కారణం ఇదేనని వివరించారు.

సీక్రెట్ ఆన్‌లైన్ సర్వే నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ ఎగ్జెటర్ సైంటిస్టులు.. సెక్సువల్ హరాజ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వారి ఆన్సర్స్, లైంగిక వేధింపులు ఎదుర్కోని వారి సమాధానాలను కంపేర్ చేశారు. ఈ పరిస్థితిని అనుభవించిన వారు పోలీసులు, అధికారులతో సహా అనేక విధానపరమైన అడ్డంకులు ఉన్నాయని.. వాస్తవ అవసరాలపై తక్కువ శ్రద్ధ చూపబడుతుందని తెలిపారు. ఇక ఈ సంఘటనను ఫేస్ చేయనివారు లైంగిక వేధింపులకు అధికారిక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

అలా అయితేనే సమాజం మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే బాధితులు న్యాయ పోరాటం చేస్తారని చాలా మంది ఊహిస్తుంటారు. కానీ వారు వ్యక్తం చేసిన అన్ని అవసరాలలో న్యాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడలేదు. ఫైనల్‌గా 589 మంది పాల్గొన్న సర్వే( 301 మంది అనుభవజ్ఞులు, 288 మంది ఇమాజినర్లు) ఫలితాలు.. లైంగిక వేధింపుల తర్వాత మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకు బయటకు చెప్పుకోలేరు? అనే విషయాలపై కాస్త అవగాహన కల్పించాయి.

Also Read: రోజు హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటున్నారా?.. అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే..

భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడంలో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Advertisement

Next Story