మూత్రంతో నిండిపోయిన స్విమ్మింగ్ పూల్స్.. హెచ్చరికలు జారీ..

by sudharani |
మూత్రంతో నిండిపోయిన స్విమ్మింగ్ పూల్స్.. హెచ్చరికలు జారీ..
X

దిశ, ఫీచర్స్ : హాలిడేస్‌లో ఈత నేర్చుకునేందుకు పిల్లలను స్విమ్మింగ్ పూల్స్‌కు పంపిస్తున్నారా? లేదా మీరే ఫిట్‌నెస్‌పై శ్రద్ధతో స్విమ్ చేస్తున్నారా? అయితే అనారోగ్యం పాలయ్యేందుకు ఎంతో దూరంలో లేరని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతీ ఈత కొలను కచ్చితంగా యూరిన్ కలిగి ఉందని చెప్తున్నారు అల్బెర్టా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు. రెండు కెనడియన్ నగరాల్లోని 31 కొలనుల నుంచి 250 శాంపిల్స్ కలెక్ట్ చేసిన సైంటిస్టులు.. మూత్రం స్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.

ఒలింపిక్ పరిమాణం కలిగిన పూల్‌లో (830,000-లీటర్ పూల్‌) మూడింట ఒక వంతు మూత్రం ఉండగా.. మరొక చిన్న కొలనులో 30 లీటర్లు ఉన్నట్లు తెలిపారు. మానవులు యూరిన్ ద్వారా ఈ పూల్‌లోని నీటిలోకి రకరకాల రసాయనాలను ప్రవేశపెడతారని.. 2016 రియో​ఒలింపిక్ పూల్స్‌లో రాత్రిపూట నీటి రంగు మార్పు నీటి నాణ్యతను పర్యవేక్షించవలసిన అవసరాన్ని హైలైట్ చేసాయని వివరించారు. అధ్యయనం ప్రకారం.. ఈత కొలనులలో మూత్రం ఉండటం, పలు రసాయనాల మిళితం కావడంతో ఈతగాళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed