ఆ లోపంతో బాధపడుతున్న 90 శాతం మంది స్త్రీలు.. కాసేపు సమయం కేటాయించలేకే ఇదంతా..

by Javid Pasha |   ( Updated:2024-03-15 07:57:28.0  )
ఆ లోపంతో బాధపడుతున్న 90 శాతం మంది స్త్రీలు.. కాసేపు సమయం కేటాయించలేకే ఇదంతా..
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలకు, అనారోగ్యాలకు స్త్రీ, పురుష భేదభావం ఉండదు. అవి ఎవరైనైనా ఒకేలా ట్రీట్ చేస్తాయి. పర్యవసనాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రజెంట్ స్త్రీలలో మాత్రమే దాదాపు 90 శాతం మంది ఒక లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల వారు సదరు మహిళలు చాలా సఫర్ అవుతున్నారు. మానసిక అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది స్త్రీల వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపైనే కాకుండా వారిపై ఆధారపడిన పిల్లలు, కుటుంబాలపై పరోక్షంగా ప్రభావం చూపుతోంది. అందుకే ఆ లోపాన్ని సరిచేసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రాబ్లం అనుకుంటున్నారా?.. విటమిన్ డి లోపం.

బిజీ షెడ్యూల్‌ వల్ల కూడా..

పొద్దున్నే లేచినప్పటి నుంచి సాధారణంగా ఉండే ఇంటి పనుల కారణంగా కొందరు మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నేటికీ ఉంటున్నాయి. కుటుంబానికి వంట చేయడం, ఉద్యోగానికి వెళ్లే భర్తకు, స్కూలుకు వెళ్లే పిల్లలకు టిఫిన్లు, వంటలు రెడీ చేయడం వంటి పనులలో నిమగ్నమై తమ ఆరోగ్యాలను కూడా పట్టించుకోవడం లేదు కొందరు. ఈ విధమైన లైఫ్‌స్టైల్ వల్ల బయట ఎండలో అరగంట సేపు కూడా గడపలేని మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా వారిలో ఇది విటమిన్ డి లోపానికి దారితీస్తోంది. సహజమైన సూర్యరశ్మి ద్వారానే దాదాపు శరీరానికి అవసరమైన డి విటమిన్ లభిస్తుంది. ఎప్పుడైనా అనారోగ్యాలవల్ల ఎక్కువగా లోపిస్తే మెడిసిన్, చికిత్స వంటివి తీసుకోవచ్చు. కానీ అసలుకే ఎండ తగలకుండా ఉంటే మాత్రం లైఫ్ రిస్కులో పడ్డట్టే.

ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాస్తవం ఏంటంటే.. కాసేపు సూర్యరశ్మి సోకేలా ఎండలో నిలబడలేని పరిస్థితి కారణంగానే మనదేశంలో 90 శాతం మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇది పలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తోంది. మెట్రో సిటీలల్లో ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా కనబడుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డి విటమిన్ లోపించిన మహిళలల్లో ఎముకల బలహీనత, బాడీ పెయిన్స్, మెంటల్ డిజార్డర్స్ వంటివి తలెత్తుతున్నాయి. ఆ తర్వాత వీటిని తగ్గించుకోవడానికి మెడిసిన్ వాడాల్సి వస్తోంది. కొందరికి ట్రీట్మెంట్ అవసరం అవుతోంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే రోజూ ఓ 20 నిమిషాలు ఉదయపు వేళ ఎండలో నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఆహారాల విషయానికి వస్తే ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, మష్రూమ్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండటంవల్ల కూడా విటమిన్ డిని పొందవచ్చు.

Read More..

World Sleep Day : నిద్రలో ఉలిక్కి పడుతూ.. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే అసలు కారణం ఇదే..

Advertisement

Next Story

Most Viewed