Strange culture: గర్ల్ ఫ్రెండ్ కావాలా నాయనా..? అక్కడ అద్దెకు తెచ్చుకోవచ్చు!

by Javid Pasha |   ( Updated:2024-10-15 14:41:22.0  )
Strange culture: గర్ల్ ఫ్రెండ్ కావాలా నాయనా..? అక్కడ అద్దెకు తెచ్చుకోవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అనేక సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. మరికొన్నిచోట్ల కాలంతోపాటు అవి కూడా మారుతుంటాయి. ఇంకొన్నిచోట్ల కొత్త పద్ధతులు, ఆచారాలు పుట్టుకొస్తుంటాయి. సరికొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతం కొన్ని వింత జాబ్స్ లేదా ప్రొఫెషన్స్ కూడా పుట్టుకొచ్చాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటిలో అద్దె ప్రకారం ఒకరికి గర్ల్/బాయ్ ఫ్రెండ్‌గా ఉండటం కూడా వృత్తిగా కొనసాగిస్తున్నవారు ఉన్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అయితే ఎక్కడెక్కడ ఈ పద్ధతులు ఫాలో అవుతున్నారో చూద్దాం.

జపాన్ దేశంలోని టోక్యోలో (Tokyo) నగరంలో ఇప్పుడు చాలా మంది యువతులు గంటకు, రోజుకు చొప్పున ఇతరులకు గర్ల్ ఫ్రెండ్‌గా ఉండే ప్రొఫెషన్‌ను ఎంచుకుంటున్నారు. ఇక్కడ అద్దె స్నేహితురాలిని రెండో కనోజో అని పిలుస్తారు. అలాగే బాయ్ ఫ్రెండ్‌ వృత్తిని కొనసాగిస్తున్న యువకులు కూడా చాలా మందే ఉన్నారు. విహార యాత్రలకు వెళ్లినప్పుడో, ఈవెంట్లలో తమ హోదాను ప్రదర్శించుకోవడానికో, ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి టోక్యో నగరంలోని యువత ఇప్పుడు గర్ల్/బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. వన్ డే తమను హైర్ చేసుకున్నవారికోసం భాగస్వామిగా లేదా గర్ల్ ఫ్రెండ్‌గా ఉండటానికి ముందుకొచ్చే వారు ఇక్కడ చాలా మందే కనిపిస్తారు. 1990 నుంచి జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మరింత పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కూడా అద్దెకు భాగస్వాములను తీసుకోవడం ఇప్పుడు చాలా సాధారణమైన విషయంగా పరిగణిస్తారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.

Advertisement

Next Story