వంట నూనె పొయ్యి దగ్గరే పెడుతున్నారా? క్యాన్సర్ రిస్క్ తప్పదు...

by Sujitha Rachapalli |
వంట నూనె పొయ్యి దగ్గరే పెడుతున్నారా? క్యాన్సర్ రిస్క్ తప్పదు...
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కిచెన్ లో నూనె స్టవ్ పక్కనే పెట్టేస్తుంటారు. అందుబాటులో ఉంటుందని ఆలోచనతో ఇలా చేస్తుంటారు. కానీ ఈ పద్ధతి క్యాన్సర్ రిస్క్ తో పాటు మరిన్ని రోగాలకు వెల్ కమ్ చెప్పడమేనని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలా పొయ్యి దగ్గర నూనె పెట్టడం వల్ల ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. నూనె.. క్యాన్సర్ కారకమైన రాన్సిడ్ గా మారుతుంది.

కుకింగ్ అయిల్స్ అధిక కొవ్వు కంటెంట్ తో ప్యాక్ చేయబడుతాయి. ఓపెన్ చేయగానే హై ఆక్సిడేషన్ వల్ల వాతావరణంలోని ఆక్సిజన్ ట్రైగ్లిజరైడ్ మాలిక్యూల్స్ ఫ్యాటీ యాసిడ్ చైన్స్ పై ఎటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ చేరి నూనె డీకంపోజ్ అవుతుంది. ఇలాంటి రాన్సిడ్ అయిల్ తినడం వల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ఒబేసిటీ, అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది. డెయిలీ ఈ నూనె తీసుకోవడం వల్ల క్యాన్సర్ తో పాటు టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధులకు కారణం అవుతుంది. జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed