- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాక్లెట్ను ఎవరు కనిపెట్టారు... అప్పట్లో చాక్లెట్ను కవర్లో కాకుండా బంగారు పాత్రల్లోనే ఎందుకిచ్చేవారు?
దిశ, వెబ్ డెస్క్: చాక్లెట్ పేరు వింటే చాలు చాలామందికి ఇట్టే నోరూరుతుంది. పిల్లల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాక్లెట్ అనగానే వాళ్లు ఎగిరి గంతేస్తారు. మరి ఇంత ఇష్టమైన చాక్లెట్లకు సంబంధించిన కొన్ని కమ్మని సంగతులు తెలుసుకుందాం. ఇప్పటికీ 2600 ఏళ్ల కిందట నివసించిన మాయ నాగరికతకు చెందిన మనుషులు చాక్లెట్ ని ఒక పానీయంగా తీసుకునేవారని ఆధారాలు దొరికాయంటా.
అయితే, మన ఆధునిక ప్రపంచానికి చాక్లెట్ ని పరిచయం చేసింది మాత్రం హెర్మన్ కోర్టస్ అనే ఒక స్పెయిన్ అన్వేషకుడు. 1519 లో మెక్సికోలోని హెజ్ టెక్ అనే ప్రాంతానికి అతను వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు కోకో గింజల్ని డబ్బులాగా వాడటాన్ని గమనించాడు. దానితోపాటు అక్కడివారు 'చాక్ లేటర్' అనే ఒక పానీయాన్ని బంగారం పాత్రల్లో పోసి అతిథులకు ఇవ్వడాన్ని కూడా అతను గమనించాడు. ఆ ప్రాంతంలో కోకో చెట్టును పెంచడం, చాక్లెట్లను తయారు చేయడం అనేది అంతకుముందు వందేళ్ల నుంచి రహస్యంగా కొనసాగుతుందని అతను కనిపెట్టాడు. అయితే, చాక్లెట్ గురించి ఐరోపా వారికి తెలియజేశాడు. 1650 నాటికి ఐరోపా వాసులందరికీ చాక్లెట్ పానీయంలో ఉన్న మజా ఏమిటో తెలిసిపోయింది. అప్పటి నుంచి చాక్లెట్ ఫేమస్ అయ్యింది.
చాక్లెట్ గురించి మరికొన్ని విషయాలు...
- మొట్టమొదటి చాక్లెట్ బాక్స్ ను క్యాడ్ బరీ సంస్థ ప్రవేశపెట్టింది
- చాక్లెట్ కు ఆ కమ్మని వాసన, రుచి ప్రధానంగా కోకో అనే పదార్థం వల్ల వస్తాయి.
- ఒక అరటిపండులో కన్నా ఒక మాములు మిల్క్ చాక్లెట్ బార్ లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి.
- కోకో ఉత్పత్తిలో ఈనాడు ఘనా, బ్రెజిల్, నైజీరియాలు ముందంజలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :