3 గంటల్లో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.. కొత్త టెక్నిక్‌ను కనుగొన్న స్పానిష్ సైంటిస్టులు

by Prasanna |   ( Updated:2023-04-14 10:07:52.0  )
3 గంటల్లో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.. కొత్త టెక్నిక్‌ను కనుగొన్న స్పానిష్ సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్‌ను గుర్తించడానికి లాంగ్ ప్రాసెస్‌తో కూడిన స్ర్కీనింగ్ టెస్టులు అవసరం. కానీ స్పెయిన్‌లోని సైంటిస్టులు మూడు గంటల్లోనే డిటెక్ట్ చేయగల చౌకైన, సులభమైన అధునాతన మొబైల్ టెస్టింగ్ కిట్‌ను డెవలప్ చేశారు. బార్సిలోనా సెంటర్ ఫర్ జెనోమిక్ రెగ్యులేషన్ టీమ్ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్లడ్ శాంపిల్స్‌లోని రిబోన్యూక్లిక్ సిడ్ (RNA)ని సమర్థవంతంగా విశ్లేషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో కూడిన ఈ సాంకేతికత, నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో బ్లడ్‌లోని క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తుంది.

‘‘మా లక్ష్యం కృత్రిమ మేధస్సుతో మూడు గంటలలోపు బయోలాజికల్ శాంపిల్ ద్వారా ప్రాణాంతక క్యాన్సర్‌ను గుర్తించడమేగాక, అతి తక్కవ ఖర్చులో ఆ టెస్టు చేయగలగాలి’’ అని సీనియర్ పరిశోధకుడు డాక్టర్ ఎవా నోవోవా తెలిపాడు. అందుబాటులోకి రాబోయే ఈ కొత్త టెక్నిక్‌ RNA అణువులను పొరలోని చిన్న రంధ్రాల ద్వారా విద్యుత్ ప్రవాహంలో కొలవగల మార్పులకు దోహదం చేస్తుందని వివరించాడు. దాని సరళత కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనారోగ్యాలను గుర్తించడంలో ముఖ్యమైన పురోగతికి దారితీయవచ్చునని చెప్తున్నాడు. సైంటిస్టుల బృందం కనుగొన్న ఈ మొబైల్ టెస్టింగ్ కిట్లలో వినియోగించిన నానోపోర్ సీక్వెన్సింగ్ మెషీన్‌లు చాలా చిన్నవి, తేలికైనవి కూడా. ల్యాప్‌టాప్ లేదా పోర్టబుల్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందే వీటిని సుదూర ప్రాంతాలకు రవాణా చేయడం కూడా సులభం. ఫీల్డ్ లేదా క్లినిక్‌లో యూజ్ చేయవచ్చు. క్యాన్సర్ ఉనికిని గుర్తించడం మాత్రమే కాకుండా, ఈ టెస్టింగ్ కిట్లతో బయాప్సీ టెస్టు అవసరం లేకుండానే వ్యాధి ఎంత డెవలప్ అయిందో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు పరిశోధకులు లింఫోమా, రొమ్ము, ప్రేగు క్యాన్సర్లను గుర్తించే ఉద్దేశంతోనే అధునాతన టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. భవిష్యత్తులో ఇతర వ్యాధులను గుర్తించడానికి అనుకూలంగా కూడా ఇటువంటి టెక్నాలజీ డెవలప్ చేస్తామని స్పానిష్ సైంటిస్టులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: ‘అది పియానో వాయించడాన్ని గుర్తు చేసింది’.. వైరల్ అవుతున్న ఓ వ్యక్తి స్పీడ్ టైపింగ్ వీడియో

Advertisement

Next Story

Most Viewed