BUMPER OFFER : ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకుంటే రూ. 30 లక్షల నజరానా..

by Sujitha Rachapalli |
BUMPER OFFER : ప్రభుత్వం బంపర్ ఆఫర్..   పెళ్లి చేసుకుంటే రూ. 30 లక్షల నజరానా..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటుతో సతమతమవుతున్న సౌత్ కొరియా... ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జనాభా క్షీణతను తిప్పికొట్టేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు మొగ్గు చూపుతోంది. వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్న వారికి ఏకంగా రూ. 31 లక్షలకు పైనే చెల్లిస్తుంది. బుసాన్‌లోని సాహా డిస్ట్రిక్ట్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించింది.

దేశంలో తగ్గిపోతున్న జనాభాను ఎదుర్కొనే విస్తృత వ్యూహంలో ఇదొక భాగం కాగా.. ఒక్క మహిళకు 0.72 పిల్లల సంతానోత్పత్తి రేటు మాత్రమే ఉండటం ఆ దేశ భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అక్కడ పితృస్వామ్య వ్యవస్థ దారుణంగా పాతుకుపోవడం ఇందుకు కారణమని అంటున్నారు నెటిజన్లు. భరించలేని హానికరమైన, అణిచివేసే స్థాయికి చేరుకోవడం వల్లే మహిళలు 4B మూమెంట్ చేపట్టారని.. ఇందులో భాగంగా పురుషులు, వివాహం, పిల్లల్ని కనకుండా వీటన్నింటికీ దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారని చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం దగ్గరుండి మరీ పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి పెళ్లిళ్లు చేసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.

Advertisement

Next Story