- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పురాతన హిమానీ నదాన్ని కనుగొన్న సైంటిస్టులు.. 2.9 బిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే..
దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అత్యంత పురాతన హిమానీ నదాల జాడను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ అండ్ ఒరెగాన్ యూనివర్సిటీలకు చెందిన సైంటిస్టులు కనుగొన్నారు. కాప్‌వాల్ క్రాటన్ ఫీల్డ్ సైట్ ప్రాంతంలోని అతిపెద్ద షేల్ నిక్షేపాల కిందగల కోర్ శాంపుల్స్‌ను ఎనలైజ్ చేశారు. దీని ద్వారా ఇక్కడ 2.9 బిలియన్ సంవత్సరాల క్రితం మంచు పర్వతాలు కరిగి నీరు ప్రవహించిందని గుర్తించారు.
ఆ ప్రదేశంలో ఖండాంతర ఐస్ క్యాప్స్‌తోపాటు ఆ ప్రాంతం భూమి యొక్క ధృవాలకు దగ్గరగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాము సేకరించిన నమూనాలలోని కొన్ని ఐసోటోప్‌లు మంచుతో కూడిన ఉష్ణోగ్రతలలో సాధారణమైన వాటితో సరిపోలుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తమ పరిశోధన భూ వాతావరణం, భౌగోళిక శాస్త్రం గురించిన మరిన్ని ఆధారాల సేకరణకు దోహదపడుతుందని అభిప్రాయ పడుతున్నారు. మరొక విషయం ఏంటంటే.. 2.9 బిలియన్ సంవత్సరాల క్రితం కాప్‌వాల్ క్రాటన్ ప్రాంతంలోని కొంత భూ భాగం ‘స్నోబాల్ ఎర్త్’ గా ఉండవచ్చని పరిశోధకుడు హాఫ్‌మన్ తెలిపాడు. అప్పట్లో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అండ్ మిథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత చాలా తక్కువగా ఉండేదని పేర్కొన్నాడు.