- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే ట్రాక్‌లతో కరెంట్ ఉత్పత్తి.. పెద్దమొత్తంలో వినియోగం..
దిశ, ఫీచర్స్: వాతావరణ సంక్షోభం శక్తి పరివర్తనను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన, రిజర్వాయర్లు, పొలాలు, ఇళ్లు ఇలా అన్నిచోట్లా సోలార్ ప్లేట్స్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా స్విట్జర్లాండ్‌లో రైల్వే స్లీపర్స్‌కు సోలార్ ప్యానల్స్‌ను అటాచ్ చేశారు. స్టార్టప్ కంపెనీ సన్‌వేస్ బుట్స్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రయోగం చేయగా.. ఈపీఎఫ్‌ఎల్ సహాయంతో రిమూవబుల్ సోలార్ ప్యానల్స్ సిస్టెమ్‌కు పేటెంట్ పొందిన సంస్థగా రికార్డు క్రియేట్ చేసింది. అవసరమైన నిర్వహణ పనుల కోసం రైల్వే ట్రాక్‌లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిమూవబుల్ సోలార్ ప్యానల్స్ కీలకమని తెలిపారు కంపెనీ ప్రతినిధులు.
Also Read: గవర్నర్ సంచలన నిర్ణయం.. ఉదయం 5.30 గంటలకే పాఠశాలలు ప్రారంభం!
ఇక ఈ ప్యానల్స్‌ను వ్యవస్థాపించడానికి మెకానికల్ సిస్టమ్‌ను యూజ్ చేస్తున్నట్లు తెలిపారు. స్విస్ ట్రాక్ నిర్వహణ సంస్థ Scheuchzer అభివృద్ధి చేసిన రైలు.. పట్టాల వెంట ప్రయాణిస్తూ.. కార్పెట్ అన్‌రోలింగ్ మాదిరిగా ఫోటోవోల్టాయిక్ ప్యానెల్‌లను వేస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన రైలు కర్మాగారంలో ముందుగా అసెంబుల్ చేసిన ఒక మీటరు వెడల్పు ప్యానెల్‌లను విప్పడానికి పిస్టన్ మెకానిజంను ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో PV వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు పవర్ గ్రిడ్‌లోకి ఫీడ్ చేయబడుతుంది. రైల్వే కార్యకలాపాలకు అందించడం మరింత సంక్లిష్టమైన ప్రక్రియ కాబట్టి గృహాలకు శక్తినివ్వడానికి ఉపయోగించబడుతుంది.
ఈ విధంగా స్విట్జర్లాండ్ రైల్వే నెట్‌వర్క్ సంవత్సరానికి ఒక టెరావాట్ పర్ హవర్ (TWh) సౌర శక్తిని ఉత్పత్తి చేయగలదని సన్-వేస్ అంచనా వేసింది. ఇది దేశం మొత్తం శక్తి వినియోగంలో దాదాపు 2 శాతానికి సమానం. అయితే ఈ ప్యానెల్స్ మైక్రో క్రాక్‌లకు గురవుతాయని, పచ్చని ప్రాంతాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉందని, రిఫ్లెక్షన్స్‌తో రైలు డ్రైవర్ల దృష్టి మరల్చవచ్చని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ సాంప్రదాయక సోలార్ ప్యాలెన్స్ కంటే ఇవి ఎక్కువ నిరోధకతను కలిగి ఉన్నాయని, రైలు డ్రైవర్ల దృష్టిపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి యాంటీ-రిఫ్లెక్షన్ ఫిల్టర్‌ను ఉపయోగిస్తున్నట్లు వివరించింది సన్‌వేస్ కంపెనీ. అంతర్నిర్మిత సెన్సార్స్ సరిగ్గా పనిచేస్తాయని, రైళ్ల చివర జోడించిన బ్రష్‌లు ప్యానెల్స్ ఉపరితలం నుంచి మురికిని తొలగించగలవని వివరించింది. హిమపాతంతో ప్యానెల్‌లు పనికిరాకుండా పోతాయని కొందరు అభిప్రాయపడగా.. ఘనీభవించిన అవపాతాన్ని కరిగించే వ్యవస్థపై ప్యానెల్ పని చేస్తోందని కంపెనీ స్పష్టం చేసింది.
Also Read..
మొగుడంటే ఇలా ఉండాలి.. యువతిని పెళ్లాడటానికి బంధువులను 28 కి.మీ నడిపించిన వరుడు..