- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యాప్ యూజర్స్‌లో 95శాతం రోబోలే.. కానీ రూ. 20కోట్ల ఫండ్స్ వచ్చాయి.. అలా ఎలా?
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా యాప్ IRLను విచిత్ర కారణంతో షట్ డౌన్ చేసే పరిస్థితి వచ్చింది. దీని యూజర్స్‌లో 95శాతం రోబోలు అని నిర్ధారణ కావడంతో మూసేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ యాప్ విలువ ఒకానొక పాయింట్‌లో రూ. 98వేల కోట్ల వాల్యూ కలిగి ఉండగా.. ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడంపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. IRL వ్యవస్థాపకుడు, CEO అబ్రహం షఫీ ఈ కంపెనీని 2018లో స్థాపించారు. ఆఫ్‌లైన్ కనెక్షన్స్ ట్రిగ్గర్ చేయాలనుకునే Gen-Z ఫోకస్డ్ యాప్‌గా పిచ్ చేయబడింది.
‘ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఉండటం, స్నేహితులుగా మారడం, భాగస్వామ్య ఆసక్తితో సమాజాన్ని నిర్మించడంలో సహాయపడటమే ఈ యాప్ లక్ష్యం. ఇతర యాప్స్‌కు ఇది ఎగ్జాక్ట్‌గా అపోజిట్’ అని 2022లో ఫోర్బ్స్‌తో చెప్పాడు. అంతేకాదు 20 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని పదే పదే చెప్పుకొచ్చిన వ్యవస్థాపకుడు అబ్రహం షఫీ.. వివిధ సంస్థల నుంచి రూ. 20కోట్ల ఫండ్ వచ్చేలా మేనేజ్ చేశాడు. అయితే ‘ది ఇన్‌ఫర్మేషన్’ నివేదికలు యాప్ ప్రకటన సంఖ్యలను ప్రశ్నించడంతో కంపెనీ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ షఫీని సస్పెండ్ చేసి, అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో గణాంకాలు దాదాపు పూర్తిగా నకిలీవని గుర్తించబడింది. కంపెనీ ముందుకు సాగే అవకాశాలు లేవని మెజారిటీ వాటాదారులు నిర్ధారించడంతో యాప్ పూర్తిగా మూసివేయబడుతోంది. పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి వచ్చేస్తుంది.
Read More: నీటిని వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి