- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
గౌతమ బుద్ధుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆరు జీవిత పాఠాలు..!!
దిశ, ఫీచర్స్: బుద్ధుడు ప్రపంచ శాంతి గీతం. ఒక దీక్షా దక్షుడు. భోగభాగ్యాలతో పులపూగుతూ స్వర్గసుఖాలు అనుభవిస్తూ.. వాటిల్లో ఆనందం లేదని, అన్నింటిని వదిలేసి సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్లిన గొప్ప త్యాగశీలి. కఠోర దీక్ష బోధి వృక్షం కింద మహా ధ్యానం చేసి జ్ఞానం పొందాడు బుద్ధుడు. అనంతరం తన జ్ఞాన యజ్ఞంతో శోధించి సాధించిన ఫలాలతో దు:ఖంలో ఉన్న మనిషికి మార్గ నిర్దేశం చేసిన మహా బాధకుడు ఆయన.
కొట్టడం, పెరగడం, గిట్టడం అనే మూడు జీవన ప్రక్రియల్లో పడి.. మానవుడు తన దారేదో తెలియక తికమక పడుతోన్న రోజుల్లో సుఖ దుఖాల మధ్య నలుగుతోన్న తరుణంలో ప్రజలకు దారి చూపిన గొప్ప వ్యక్తి. బుద్ధుడు తన దేవుడ్ని అని చెప్పలేదు. తనను తను అలా ఆరాధించవద్దన్నాడు. ఇంతటి గొప్పతనం ఉన్న బుద్ధుడి పేరు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఈయన ముఖం ఎప్పుడూ చూసినా కళ్లు మూసుకుని ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తాడు. ఎవరైతే లైఫ్ లో హింసకు దూరంగా ఉంటూ.. ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటారో వారు గౌతమ్ బుద్ధుడిని అనుసరించాలనుకుంటారు. కాగా బుద్ధుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆరు జీవిత పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* సంతృప్తి గొప్ప సంపద..
ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్నవారు అమిత సంతోషాన్ని సంతృప్తిని అనుభవిస్తారు. సంతోషం-సంతృప్తి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. కాగా శ్రమకు మించిన ఫలితాన్ని కోరడం అర్హతను మించి ఆశించడం ఎప్పుడూ దు:ఖ హేతువే. బుద్ధుడు ఆరు జీవిత సత్యాల గురించి బోధించాడు.
* అందరి పట్ల సానుభూతి కలిగి ఉండటం..
ఇతరుల పట్ల సానుభూతి, దయతో ఉండటం బుద్ధ భగవానుని బోధనల్లో ప్రధానమైనది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకోవాలి. ఎవరైతే తమ జీవితంలో సానుభూతిని, దయను కలిగి ఉంటారో వారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.
*జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి..
బుద్ధుడు మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదని చెప్పాడు. అంగీకరించడం, వదిలిపెట్టడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంటుంది. వాటిని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి.
*ఏ పనైనా బుద్ధిపూర్వకంగా మనస్సాక్షిగా చేయాలి..
ఏదైనా పని ప్రారంభించేటప్పడు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అప్పుడే వారు తమ ఆలోచనలు, బావోద్వేగాలు, పనుల గురించి క్లారిటీ వస్తుంది.
* కోపం, అహంకారం వదిలిపెట్టాలి..
తన కోపం తన శత్రువే అన్నట్లు.. అహంకారంతో ఉండే మనిషి తన కోపానికే కాలిపోతాడు. అహంకారం బంధాలను నాశనం చేస్తుంది. సంఘర్షణలు కారణంగా అసంతృప్తికి దారితీస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కోపాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టాలి.
* భౌతిక సుఖాలపై అధిక వ్యామోహం..
మనిషి జీవితంలో కోరికలు ఎక్కువైతే కష్టాలు కొనితెచ్చుకున్నవారు అవుతారు. ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. కాగా భౌతిక సుఖాలపై అధిక వ్యామోహాలను వదిలిపెట్టాలి.