- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ ఎక్సర్ సైజ్.. ఇలాంటి వ్యాయామం చేస్తే కథ వేరే
దిశ, ఫీచర్స్ : లైంగిక పనితీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడే వ్యాయామం 'సెక్సర్‌సైజ్'. ఇది సెక్సువల్ పార్ట్‌నర్స్ మధ్య శృంగారాన్ని మరింత సంతృప్తికరంగా మారుస్తుంది. సెలబ్రిటీ ట్రైనర్ జాసన్ రోసెల్.. వ్యక్తుల లైంగిక అనుభవాన్ని మెరుగుపరిచే నిర్దిష్ట అభ్యాసాలు సూచించేందుకు ఈ 'సెక్సర్‌సైజ్' పదాన్ని ఉపయోగించారు. నిజానికి శారీరక దృఢత్వం.. అంగస్తంభన, భావప్రాప్తి సమస్యల ప్రమాదాన్ని తగ్గించి శృంగారాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. అంతేకాదు వ్యక్తులకు తమ శరీరాలపై నమ్మకాన్ని పెంచేందుకు సాయపడుతుంది. ఇక లైంగిక సమస్యలకు కారణమయ్యే మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈ వ్యాయామం ద్వారా తగ్గించవచ్చు. ఈ క్రమంలో ఫిజికల్ ఫిట్‌నెస్ సెక్సువల్ పర్ఫార్మెన్స్‌కు ఏవిధంగా సాయపడుతుంది? ఏయే వ్యాయామాలు ఇందుకు తోడ్పడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
లైంగిక పనితీరుకు ఫిట్‌నెస్ ప్రయోజనాలు :
* అంగస్తంభన సమస్య తగ్గిస్తుంది : ఈ సమస్య గల పురుషులు క్రమం తప్పకుండా నడక, పరుగు వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. మోస్తరు నుంచి హై-ఇంటెన్సిటీతో కూడిన ఈ తరహా వ్యాయామం సరైన ప్రయోజనాలను అందించిందని 2017 మెటా-విశ్లేషణలో వెల్లడైంది.
* యాంటిడిప్రెసెంట్స్ దుష్ప్రభావాలు ఎదుర్కోవడం : యాంటీడిప్రెసెంట్స్ తీసుకునే స్త్రీలు సెక్స్‌కు ముందు వ్యాయామం చేయడం వల్ల భావప్రాప్తి, లైంగిక పనితీరు రెండూ మెరుగుపడతాయని 2013 అధ్యయనం కనుగొంది.
* దీర్ఘకాలిక మెడికల్ కండిషన్స్ తగ్గిస్తుంది : ఈ పరిస్థితులు లైంగిక పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఉదాహరణకు అంగస్తంభన, భావప్రాప్తి తదితర లైంగిక సమస్యలతో డయాబెటిస్‌కు సంబంధాలు ఉన్నాయి.
* లైంగిక పనితీరును మెరుగుపరచడం : కొన్ని వ్యాయామాలు శృంగార సమయంలో ఒక వ్యక్తి ఉపయోగించే పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. కెగెల్ వ్యాయామాలు సులభమైన భావప్రాప్తిని కలిగిస్తాయి. యూరిన్ లీకేజ్, ఆపుకోలేని పరిస్థితులను అధిగమించేందుకు సాయపడతాయి.
* ఓర్పు, బలాన్ని పెంచడం : ఇది సెక్స్ పొజిషన్స్, రకాలను సులభతరం చేస్తుంది. ఓర్పు పెరగడం వల్ల సుదీర్ఘ సెక్స్ సెషన్లలో అలసట లేకుండా పాల్గొనవచ్చు.
పర్ఫార్మెన్స్ పెంచే వ్యాయామాలు :
ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. తగినంత బరువును మెయింటైన్ చేసేందుకు, రక్తపోటును మెరుగుపరచడమే కాక శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది. ఇందుకు సంబంధించి ప్రయత్నించాల్సిన కొన్ని వ్యాయామాలు:
* స్విమ్మింగ్ : కీళ్లు లేదా కండరాల నొప్పితో బాధపడుతున్న వ్యక్తులకు బెస్ట్ ఎక్సర్‌సైజ్
* నడక : ఇంటెన్స్ వర్కవుట్స్‌తో పోరాడే వ్యక్తులకు ఆదర్శవంతమైన ప్రారంభ వ్యాయామం.
* ఇంటెన్స్ ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ : రన్నింగ్, జాగింగ్, జంపింగ్ రోప్, స్కీయింగ్ లేదా మెట్లు ఎక్కే యంత్రాన్ని ఉపయోగించడం.
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు :
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు కటి భాగాన్ని(మూత్రాశయానికి మద్దతిచ్చే కండరాల సమూహం) బలోపేతం చేస్తాయి. ఈ కండరాలు భావప్రాప్తి సమయంలో సంకోచించబడతాయి.
కెగెల్స్ చేయడం:
- మూత్ర విసర్జన చేసేటప్పుడు సరైన కండరాలను గుర్తించాలి.
- మూత్రవిసర్జన చేస్తూ మధ్యలో కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆపై మళ్లీ ప్రారంభించాలి. ప్రతిరోజూ కొన్ని సార్లు ఇలా రిపీట్ చేయాలి.
- రోజులో చాలాసార్లు మూత్రవిసర్జన ఆపేందుకు ఉపయోగించే కండరాలను బిగపట్టి, విడుదల చేసేందుకు ప్రయత్నించాలి.
- కండరాలను ఎక్కువసేపు.. అంటే 5 సెకన్లు, 10 సెకన్లు, 30 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్టిఫ్‌గా ఉంచాలి.
పెల్విక్ ఫ్లోర్ మల్టీఫిడస్ వ్యాయామం :
- నుదిటిని చేతులతో పట్టుకుని ముఖం కిందిపైపు ఉండేలా కడుపు మీదపడుకోవాలి.
- వెన్నెముక దిగువ ఎముకను సీలింగ్ వైపు చూపించేందుకు పెల్విస్‌ను కొద్దిగా వెనక్కి ఎత్తాలి.
- ఇలా 5-10 సెకన్ల పాటు అలాగే ఉండి 10 రిపిటేషన్లతో మూడు సెట్ల వరకు పని చేయాలి.
స్క్వాట్‌లు చేయడం :
స్క్వాట్‌లు శరీరాన్ని బలోపేతం చేసి అధిక రిపిటేషన్స్‌లో తీవ్రమైన కార్డియో వ్యాయామాన్ని అందించగలవు. ఇవి దేహ కండరాలను, పెల్విక్ ఫ్లోర్‌ను బలోపేతం చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొదట స్క్వాట్ చేయలేరు. వీపు వంగకుండా లేదా నేలపై నుంచి మడమలను తీయకుండా వీలైనంత వరకు చతికిలబడేందుకు ప్రయత్నించాలి. ఆపై ఇంటెన్సివ్ స్క్వాట్స్ నిర్మించాలి.
స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ :
* యోగా, పైలేట్స్: ఇవి రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ, ఫంక్షనల్ మూమెంట్ మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ మేరకు కొన్ని యోగా భంగిమలను కూడా సెక్స్ పొజిషన్స్‌గా మార్చుకోవచ్చు.
* బరువులు ఎత్తడం: వివిధ కండరాలు, కండరాల సమూహాలను పటిష్టపరిచేందుకు బరువులు ఎత్తాలి. ఉదాహరణకు, భాగస్వామిని పైకి లేపాలనుకునే వ్యక్తి.. బెంచ్ ప్రెస్‌లు, ఎగువ శరీరాన్ని బలోపేతం చేసే ఇతర వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.
* బాడీ వెయిట్ ఎక్సర్‌సైజులు : కండరాల బలోపేతానికి బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. లెగ్ రైజెస్, మోకాలి టక్స్, స్క్వాట్స్ బాడీ వెయిట్ వ్యాయామాలు కోర్, లోయర్ బాడీ, పెల్విక్ ఫ్లోర్‌ను బలోపేతం చేస్తాయి. పుషప్స్, పుల్‌అప్స్, డిప్స్ అప్పర్ బాడీని లక్ష్యంగా చేసుకుని నిర్దిష్ట భంగిమలను సులభతరం చేస్తాయి.
జంటలు వ్యాయామంగా ఉపయోగించగల సెక్స్ పొజిషన్స్ :
- భాగస్వామిని పూర్తిగా లేదా పాక్షికంగా ఎత్తడానికి అవసరమైన స్థానాలు : స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్న భాగస్వామిని పట్టుకుని కాళ్లతో చుట్టుకున్నప్పుడు ఇద్దరూ అదనపు బరువును భరించాల్సి ఉంటుంది.
- శారీరక తీవ్రతను పెంచే, భాగస్వాములను ఎక్కువగా కదిలించే స్థానాలు : ఒక వ్యక్తి గోడకు ఆనుకుని కాళ్లను తన భాగస్వామికి చుట్టినపుడు అపోజిట్ పార్ట్‌నర్ వారిని పట్టుకుని ఉంటే, దంపతులిద్దరూ బరువులకు మద్దతు ఇస్తారు. ఇక్కడ స్టిమ్యులేషన్ పెంచేందుకు, పొజిషన్ అడ్జస్ట్ చేసుకునేందుకు వారు మరింత కదలాల్సి ఉంటుంది.
- జెంటిల్ స్ట్రెచింగ్ పొజిషన్స్ : శరీరాన్ని అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లోకి బలవంతంగా నెట్టకూడదు. అయితే భాగస్వామి భుజాలపై కాళ్లను విస్తరించడం లేదా యోగా వంటి స్థానాల్లోకి రావడం లైంగిక కార్యకలాపాల సవాలును పెంచుతుంది.