బయటపడ్డ 11వ శతాబ్దపు చర్చి.. కరువుతో జనం విలవిల

by Prasanna |   ( Updated:2023-04-07 08:59:08.0  )
బయటపడ్డ 11వ శతాబ్దపు చర్చి.. కరువుతో జనం విలవిల
X

దిశ, ఫీచర్స్: స్పెయిన్‌ దేశంలోని కాటలోనియా ప్రాంతం అనేక రకాల పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. బార్సిలోనా నుంచి 100 కి. మీ (సుమారు 62 మైళ్ళు) దూరంలోగల ఈ లోతట్టు ప్రాంతం తీవ్రమైన కరువును ఎదుర్కొంటోంది. ఇక్కడి సౌ( Sau) రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు లేకుండా పోయింది. రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎండిపోనుంది. అయితే ఈ రిజర్వాయర్‌ను 1962లో నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడున్న 11వ శతాబ్దపు సంట్ రోమా డి సౌ చర్చి ఎప్పుడూ నీటిలో ముగిపోయే ఉండేది. కానీ ప్రస్తుతం ఎండిపోయిన నీటివల్ల బయటకు కనిపిస్తుండటం.. ఇక్కడి కరువు పరిస్థితులకు అద్దం పడుతోంది.

అయితే కాటలోనియాలోని ఈ రిజర్వాయర్ ఉన్న ప్రాంతంలో రెండున్నరేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఈ ఏడాది మార్చి ప్రారంభంలో రిజర్వాయర్ నీటి మట్టం దాని సామర్థ్యంలో 8% కి పడిపోయిందని, స్పెయిన్‌కు చెందిన వాతావరణ సంస్థ AEMET ప్రకటించింది. తమ దేశం ఏడాది కాలంగా కరువు పరిస్థితిలో కొనసాగుతోందని వెల్లడించింది. దీంతో భవిష్యత్తులో తలెత్తబోయే ఇబ్బందులు, ఆహార కొరతను ఎలా ఎదుర్కోవాలో తెలియక కాటలోనియా ప్రాంతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చనిపోయిన ఆత్మలు వెళ్లే గుడి.. దీని రహస్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

హనుమంతుడు ఒంటి నిండా సింధూరాన్ని ఎందుకు ధరిస్తాడో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్‌ ఇళ్లు.. ఎక్కడుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed