బ్రిటన్‌లో ప్లేగు కేసులు..

by sudharani |   ( Updated:2023-06-02 14:30:42.0  )
బ్రిటన్‌లో ప్లేగు కేసులు..
X

దిశ, ఫీచర్స్: ఇద్దరు పిల్లలు, ఒక మహిళకు సంబంధించిన 4,000 సంవత్సరాల పురాతన మానవ అవశేషాలలో ప్లేగు వ్యాధికి కారణమైన యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియాను గుర్తించారు పరిశోధకులు. ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 34 మంది వ్యక్తుల అస్థిపంజర అవశేషాలను అధ్యయనం చేశారు. సోమర్‌సెట్‌లోని చార్టర్‌హౌస్ వారెన్‌లో సామూహిక ఖననం, కుంబ్రియాలోని లెవెన్స్‌లోని రింగ్ కెయిర్న్ స్మారక చిహ్నంలో స్టడీ నిర్వహించారు. దంతాల గుజ్జును తీయడం ద్వారా అస్థిపంజర అవశేషాల నుంచి DNAను తిరిగి పొందగా.. ఇది వ్యాధికారక DNA అవశేషాలను ట్రాప్ చేస్తుంది.

తరువాత పరిశోధకులు యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా కోసం నమూనాలను పరీక్షించారు. చనిపోయినప్పుడు 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు , 35- 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ అవశేషాలలో బ్యాక్టీరియా DNAను గుర్తించారు. వీరంతా ఒకే సమయంలో జీవించారని రేడియోకార్బన్ డేటింగ్ విశ్లేషణ వెల్లడించింది. చార్టర్‌హౌస్ వారెన్‌లో కనుగొనబడిన పిల్లల నమూనాల నుంచి డైరెక్ట్ షాట్‌గన్ సీక్వెన్సింగ్(డీఎన్‌ఏ తంతువులను క్రమం చేసేందుకు ఉపయోగించే పద్ధతి) డేటాను రూపొందించడానికి.. ఇల్యూమినా నోవాసెక్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించారు.

అయితే మహిళ నమూనా షాట్‌గన్ సీక్వెన్సింగ్‌కు అనుకూలంగా లేదని రచయితలు గుర్తించారు. అయినప్పటికీ ముగ్గురు వ్యక్తుల DNA లైబ్రరీలు డైసెల్ అర్బోర్ బయోసైన్సెస్ నుంచి Y. పెస్టిస్ RNA బైట్‌లను ఉపయోగించి ఇన్-సొల్యూషన్ టార్గెట్ ఎన్‌రిచ్‌మెంట్ విధానంతో రెండు రౌండ్ల హైబ్రిడైజేషన్ క్యాప్చర్‌కు గురయ్యాయి. Y. పెస్టిస్ నమూనాలు లేట్ నియోలిథిక్, కాంస్య యుగం (LNBA) వంశానికి చెందినవి. కాగా 4700-2800 మధ్య కాలంలో యురేషియా అంతటా ప్లేగు వ్యాధికి కారణమయ్యాయి.

Also Read..

ల్యాప్‌టాప్‌ను అక్కడ పెట్టుకొని వాడితే స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు !

Advertisement

Next Story