- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోల్పోయిన ఆర్గాన్స్‌ను రీ ప్రొడక్ట్ చేస్తున్న ఓషియన్ స్పైడర్స్.. మానవ చికిత్సకు వర్తిస్తుందా?
దిశ, ఫీచర్స్ : ఓసియన్ స్పైడర్స్ లేదా సముద్రపు సాలెపురుగులు ప్రమాదంలో కోల్పోయిన పలు శరీర భాగాలను తిరిగి పొందగలుగుతున్నాయని బెర్లిన్ హోంబోల్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని రకాల స్పైడర్స్, సెంటిపైడెర్స్, ఆర్ర్థోపొడ్స్ వంటివి కీటకాలకు వాటి కాళ్ల భాగం తెగిపోయినప్పుడు అది తిరిగి పెరుగడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఫస్ట్ టైమ్ ఓసియన్ స్పైడర్స్ మాత్రం మొత్తం బాడీనిలోని అవయవాలను రీ ప్రొడక్ట్ చేసుకోవడాన్ని సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
అధ్యయనంలో భాగంగా నిపుణులు 8 చిన్న కాళ్ల ఓషియన్ స్పైడర్లపై ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 23 స్పైడర్లను సేకరించి వాటి శరీర వెనుక భాగంలో అవయవాలను కత్తిరించారు. ఈ సందర్భంగా పెద్ద, చిన్న స్పైడర్లు ఏవి ఎలా తమ ఆర్గాన్స్‌ను తిరిగి పొందుతాయో గమనించారు. అయితే స్మాల్ స్పైడర్స్ కత్తిరించబడిన తమ శరీర భాగాలను పూర్తిగా తిరిగి పొందగలిగాయి. పెద్ద ఓషియన్ స్పైడర్లు ఈ పరిస్థితికి చేరడానికి చిన్నవాటికంటే రెండు మూడు నెలల ఎక్కువ సమయం తీసుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అయితే 90 శాతం ఓషియన్ స్పైడర్స్ తమ దీర్ఘకాలిక జీవితంలో అనేకసార్లు అవయవాలను తిరిగి పొందుతుంటాయని, , కొన్ని అరుదైన సాలెపురుగులు కనీసం ఒక్కసారైనా తమ అవయవాలను పునరుత్పత్తి చేసుకోగలుగుతాయని సైంటిస్టులు చెప్తున్నారు. ‘‘శరీరం వెనుక భాగం కత్తిరించినప్పుడు దాదాపు 14 పెద్ద ఓషియన్ స్పైడర్లు వాటిని రీ ప్రొడక్ట్ చేసుకోవడాన్ని మా పరిశోధనలో చూశాం. భవిష్యత్తులో మనుషుల్లోనూ అవయవాలు కోల్పోతే తిరిగి అతికించడం, ట్రీట్‌మెంట్ ద్వారా ఆర్గాన్స్ లైఫ్ టైమ్ పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి ఓషియన్ స్పైడర్లపై నిర్వహించిన స్టడీ మాకు దోహద పడుతుంది’’ అంటున్నారు పరిశోధకులు.