- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్.. మనుషుల్లో పెయిన్ రిలేటెడ్ ఫీలింగ్స్‌కు ఇదే కారణం!
దిశ, ఫీచర్స్ : మనకు గాయాలైనప్పుడో, ఏదైనా అనారోగ్యం కారణంగానో శరీరంలో నొప్పిని అనుభవిస్తాం. యూకేలో అయితే క్రానిక్ పెయిన్ అనేది ఒక నిశ్శబ్ద అంటువ్యాధి మాదరి విస్తరిస్తోంది. దాదాపు 28 మిలియన్ల మంది దీనిని అనుభవిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. వాస్తవానికి నొప్పి తాలూకు సిగ్నల్స్ మెదడుకు అందడంవల్ల వ్యక్తుల్లో ఈ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ బ్రెయిన్‌లో ఉంటుందని తెలుసు కానీ, అది కరెక్టుగా ఎక్కడుంటుందో మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు దానిని గుర్తించారు. ఈ పరిశోధనా ఫలితాలు నొప్పిని ఎదుర్కొంటున్న వ్యక్తులకోసం చికిత్సా పద్ధతులను డెవలప్ చేయడంలో సహాయపడతాయని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రధాన పరిశోధకుడు, న్యూరాలజిస్ట్ ప్రసాద్ షిర్వాల్కర్ తెలిపారు.
ప్రొఫెసర్ షిర్వాల్కర్, అతని సహచరులు తగ్గని దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న నలుగురు పేషెంట్లకు ఎలక్ట్రోడ్‌లను(electrodes) అమర్చారు. ఈ పరికరాల ద్వారా మెదడులోని పూర్వ సింగ్యులేట్ కార్టెక్స్ (anterior cingulate cortex), ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్(OFC) అనే రెండు ప్రాంతాలలో జరిగే యాక్టివిటీస్‌ను ఎనలైజ్ చేశారు. బాధితుల మెదడులో నొప్పికి సంబంధించిన పరిస్థితిని కొలిచారు. స్నాప్ షాట్‌లను రికార్డ్ చేశారు. దీంతో మెదడులోని ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న నొప్పికి సంబంధించిన అల్గారిథమ్ ఉంటుందని, ఇది క్రానిక్ పెయిన్ సిగ్నల్స్ ప్రభావానికి కారణం అవుతుందని కనుగొన్నారు. భవిష్యత్తులో మనుషులు ఎదుర్కొనే క్రానిక్ పెయిన్స్ త్వరగా తగ్గించేందుకు లేదా నొప్పితాలూకు బాధలు అనుభవించకుండా ఉండే విధంగా ట్రీట్మెంట్ అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన సహాయపడుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు.
Read More: ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటే చాలు!