- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Newplanet : మరో కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. జుపిటర్ కంటే పెద్ద సైజులో..
దిశ, ఫీచర్స్: ఆ నల్లని రాలలో ఎన్ని కన్నులు దాగెనో.. అన్నట్లు.. ఈ అనంత విశ్వంలో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిరంతరం అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమైన ఖగోళ శాస్త్రవేత్తలు రీసెంట్‌గా మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సౌర వ్యవస్థలో ఇప్పటి వరకు ఉన్నవాటికంటే పెద్దదైన కొత్త గ్రాహాన్ని కనుగొన్నారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా జుపిటర్ కంటే 6 రెట్లు పెద్ద సైజులో ఉండే ‘సూపర్ జూపిటర్’ను అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. కాగా ఈ న్యూ ప్లానెట్‌కు ఎప్సిలాన్ ఇండి అబ్ (Epsilon ind ab)గా పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. డైరెక్ట్ ఇమేజింగ్ టెక్నిక్ యూజబుల్ ద్వారా గుర్తించిన ఈ మెచ్యూర్ ఎక్సోప్లానెట్ 12 కాంతి సంవత్సరాల దూరంలోని ఎప్సిలాన్ ఇండి ఎ నక్షత్రం చుట్టూ తిరుగుతుండగా.. ప్రస్తుతం సౌర వ్యవస్థకు వెలుపల ఉందని సైంటిస్టులు అంటున్నారు. మరిన్ని రహస్యాలు ఛేదించేందుకు పరిశోధనలు చేస్తున్నారు.
కొత్త ప్లానెట్ ప్రత్యేకతలివే..
కొత్తగా కనుగొన్న కొత్త ప్లానెట్ ‘ఎప్సిలాన్ ఇండి అబ్’ అనేది చల్లగా ఉంటుందని, దానిపై ఉష్ణోగ్రత -1°C (30°F)గా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం అది భూమి, సూర్యుడి మధ్య దూరంకంటే కూడా 28 రెట్లు అధిక దూరంలోని ఓ నక్షతరం చుట్టూ తిరుగుతోందని పరిశోధనకు నాయకత్వం వహించిన జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త ఎలిజబెత్ మథ్యూస్ పేర్కొన్నారు. ‘Eps IND Ab’ స్టడీ కారణంగా ప్లానెట్స్‌పై వాతావరణం, అలాగే సౌర వ్యవస్థ వెలుపల జీవజాలం మనుగడ వంటి లోతైన అంశాలపై పరిశోధనలు చేయడానికి అవసరమైన అవగాహన ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.