కొత్త యాంటీబయాటిక్.. ఏఐ టెక్నాలజీ సహాయంతో కనుగొన్న సైంటిస్టులు

by Prasanna |
కొత్త యాంటీబయాటిక్.. ఏఐ టెక్నాలజీ సహాయంతో కనుగొన్న సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్ : మీకీ విషయం తెలుసా? క్రిటికల్ హెల్త్ ఎమర్జెన్సీ‌ సమయంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందిన రోగుల్లో చాలామంది చనిపోతుంటారు. దీనికి కారణం.. వెంటిలేటర్లు, బ్లడ్ కాథెటర్స్ వంటి డివైసెస్ అమర్చడం వల్ల పేషెంట్లలో వృద్ధి చెందే ప్రాణాంతక మల్టీడ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియానే. దీనినే సూపర్‌బగ్ అసినెటోబాక్టర్ బౌమన్ని (Acinetobacter baumannii) అని, ‘హాస్పిటల్ సూపర్ బగ్’ అని కూడా పిలుస్తారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లను కలిగించడం ద్వారా ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుతం మెక్‌మాస్టర్ యూనివర్సిటీ అండ్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సహాయంతో ఈ బ్యాక్టీరియాను చంపగలిగే యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు.

ఓపెన్ సర్జరీ గాయాల్లో నివాసం

గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ హాస్పిటల్ సూపర్ బగ్‌ బ్యాక్టీరియాను పరిశోధన, అభివృద్ధి కోసం లిస్టు చేయబడిన మోస్ట్ క్రిటికల్ గ్రూప్ లిస్టులో చేర్చింది. ఎందుకంటే అసినెటోబాక్టర్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వంటి తీవ్రమైన ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది ఓపెన్ సర్జరీ గాయాలు ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. ఈ బ్యాక్టీరియా (germs) సాధారణంగా నేల, నీరు వంటి వాతావరణంలోనూ కనిపిస్తుంది. ఇది సోకిన వారిలో రక్తం, మూత్ర నాళాలు, ఊపిరితిత్తులలో లేదా శరీరంలోని ఇతర భాగాలలో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ముఖ్యంగా కఫం వంటి శ్వాసకోశ స్రావాలలో(respiratory secretions), ఇంకా మానని గాయాలలో ఈ సూపర్‌బగ్ జీవిస్తూ ఉంటుంది.

యాంటీ బ్యాక్టీరియల్ కెమికల్

అయితే హాస్పిటల్ సూపర్ బగ్‌‌ ముప్పు నుంచి రోగులను కాపాడే అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు న్యూ స్ట్రక్చరల్ క్లాసెస్‌ను ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో AI సిస్టమ్ ద్వారా వందలాది యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలను పరీక్షించారు. దీనికి మొత్తం గంటన్నర సమయం పట్టింది. దీని ఫలితంగా 240 సమ్మేళనాలు ఉత్పత్తి చేయబడ్డాయి. తరువాత ఈ సమ్మేళనాలను ప్రయోగశాలలో పరీక్షించారు. ఫైనల్లీ వాటిని ‘యాంటీబయాటిక్ అబౌసిన్‌’‌గా కనుగొన్నారు. ఇది AI మోడల్ సహాయంతో కనుగొనబడిన తొమ్మిది సమర్థవంతమైన యాంటీ బయాటిక్‌లను కలిగి ఉంది. ఈ ‘అబౌసిన్’ అనే కెమికల్ ద్వారా భవిష్యత్తులో హాస్పిటల్ సూపర్‌బగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పూర్తిగా నివారించే చికిత్స సాధ్యం అవుతుందని పరిశోధకులు గ్వారీ లియూ, మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన బయోమెడిసిన్ అండ్ బయోకెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జోనాథన్ స్టోక్స్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed