- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Electrical transmission: ఎలక్ట్రికల్ ట్రాన్స్ మిషన్ ‘సూపర్ కండక్టివిటీ’ని కనుగొన్న సైంటిస్టులు
దిశ, ఫీచర్స్: రోజువారీ జీవితంలో భూ వాతావరణ పరిస్థితులలో సూపర్ కండక్టర్ల వినియోగానికి సంబంధించిన తాజా ఆవిష్కరణలోని పురోగతని సైంటిస్టులు ప్రకటించారు. డైలీ అవసరాల మేరకు విద్యుత్తును నిర్వహించగల ఈ ‘సూపర్ కండక్టర్’ పదార్థాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ శక్తిని ఉపయోగించే అధునాతన సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు సెల్ ఫోన్, ఆయస్కాంతం, కదిలే రైళ్లను చూస్తున్నాం కదా.. అలాగే భవిష్యత్ ఫ్యూజన్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రబ్లిషయ్యాయి. విద్యుత్ ట్రాన్స్ మిషన్‌కు సంబంధించిన కొత్త సూపర్ కండక్టర్‌లో లుటేటియం, అరుదైన ఎర్త్ మెటల్, హైడ్రోజన్, కొద్దిగా నైట్రోజన్ కలిపి ఉంటాయి. దాని సూపర్ కండక్టింగ్ పరాక్రమాన్ని పొందే ముందు దానిని చదరపు అంగుళానికి 145,000 పౌండ్ల ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. అంటే అది సముద్రంలోని అడు భాగంలో ఉండే కందకాల దిగువన ఉన్న ఒత్తిడికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట.
ఎర్త్ మెటల్ లుటేటియంతో నిర్వహణ
న్యూయార్క్‌లోని రోచెస్టర్ యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త రంగా డయాస్ నేతృత్వంలోని భౌతిక శాస్త్రవేత్తల బృందం దానిని ఛేదించి వచ్చని పేర్కొంది. 21 డిగ్రీల సెల్సియస్ (70 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ను నిర్వహించే హైడ్రోజన్, నైట్రోజన్‌లతో కూడిన అరుదైన ఎర్త్ మెటల్ లుటేటియం(lutetium)ను ఈ సైంటిస్టుల బృందం వినియోగించిస్తోంది. కేవలం 10,000 అట్మాస్పియర్ల ప్రెషర్‌తో ఇది అధిక మొత్తంలో ప్రయోజనం కలిగిస్తుందని భౌతిక శాస్త్రవేత్తలు అంటున్నారు. చిప్ తయారీ వంటి ఇంజనీరింగ్ ప్రక్రియలలో ప్రస్తుతం అధిక ఒత్తిళ్లు ఉపయోగించబడుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఎందుకు ముఖ్యమైనది?
చాలా తక్కువ స్థాయిలో సంపూర్ణ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని పదార్ధాలలో జీరో విద్యుత్ నిరోధకత లక్షణం(superconductivity) అనేది ఇప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద పని చేయగలదు కాబట్టి ఇది చాలా ముఖ్యం. సూపర్ కండక్టర్లు దాదాపు ఒక శతాబ్దం పాటు ఉనికిలో ఉన్నప్పటికీ, వాటి ఉపయోగం చాలా తక్కువగా ఉంది. పరిమితమైన అనువర్తనాలతో అల్ట్రాకోల్డ్ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే దాని పనితీరు సాధ్యమయ్యేది. అయితే దశాబ్దాలుగా సైంటిస్టులు గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే సూపర్ కండక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అది ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.
తదుపరి పరిశోధనలో సానుకూలతలు పొడచూపితే ఇది విద్యుత్తును ఉత్పత్తి చేసేటప్పుడు శక్తిని వృథా చేయని పరికరాలను రూపొందించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మరింత సమర్థవంతమైన కంప్యూటర్లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.
మొదటి సారిగా సూపర్ కండక్టివిటీని (అధునాతన విద్యుత్ శక్తిని)1911లో డచ్ భౌతిక శాస్త్రవేత్త హేకే కమెర్లింగ్ ఒన్నెస్ టీం కనుగొంది. వినియోగించే విధానం సక్సెస్ కాలేదు. 1980వ దశకంలో మరోసారి భౌతిక శాస్త్రవేత్తలు అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్‌లను కనుగొన్నారు. కానీ వీటి వినియోగం రోజువారీ జీవితంలో చాలా తక్కువగా ఉంటోంది. అయితే తాజా ఆవిష్కరణ రోజువారీ జీవితంలో సూపర్ కండక్టర్ల వినియోగం అధికంగా ఉండే దిశగా సత్ఫలితాలను ఇస్తుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూపర్ కండక్టర్ల వినియోగంతో విద్యుత్ శక్తిని వినియోగించుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడబడితే అక్కడ సెల్ ఫోన్‌ను యూజ్ చేసిన మాదిరిగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకరం కాని విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి : మంగళ సూత్రం విషయంలో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!