- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటితో నడిచే కారు కనిపెట్టిన శాస్త్రవేత్త.. గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు డీజిల్, పెట్రోల్, కరెంట్ తో నడిచే కార్లను చూశాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు నీటితో నడిస్తే బాగుండు కదా అనుకుంటాం. కాగా ఇదే పని చేశాడు ఇరానియన్ సైంటిస్ట్ అలాద్దీన్ ఖాస్సేమీ. నీటితో నడిచే కారును ఇన్వెంట్ చేశాడు. అరవై లీటర్ల నీటితో పది గంటల్లోనే ఏకంగా 900 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని చెప్పాడు. H2O.. హైడ్రోజన్,ఆక్సిజన్ గా విడిపోయాక పవర్ జనరేట్ అవుతుందని.. దీంతోనే కారు నడుస్తుందని వివరించాడు. అంతేకాదు కారు ఇంజన్ నీటి ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని వలన వాయు కాలుష్యం అనేదే ఉండదు. కాగా ఈ ఇన్వెన్షన్ అంతర్జాతీయంగా నమోదైందని ఖాస్సేమీ చెప్పాడు.
అయితే దీనిపై స్పందిస్తున్న కొందరు లి నిపుణులు.. కేవలం నీటితో ఇదంతా సాధ్యం కాదని చెప్తున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్ విడిపోవడం వల్ల విడుదలయ్యే శక్తితో కారు నడిచే ప్రసక్తే లేదని.. ఇందుకు కచ్చితంగా బాహ్య శక్తి అవసరమని అంటున్నారు. ఇక ఇంకొందరు అలాద్దీన్ ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ఇంతకు ముందు నీటితో నడిచే కారును కనిపెట్టిన వ్యక్తిని కనబడకుండా చేశారని హెచ్చరిస్తున్నారు.