- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొందరికి చనిపోయిన వారి మాటలు వినిపిస్తుంటాయి.. ఆ శక్తులు ఎలా వచ్చాయంటే..?
దిశ, ఫీచర్స్: ఓ స్టడీ ప్రకారం ప్రపంచ జనాభాలో ఐదు నుంచి పది శాతం మంది చనిపోయిన వారి వాయిస్ వింటుంటారు. అయితే ఈ హలోజినేషన్‌ను స్కిజోఫ్రెనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్న 70శాతం మంది అనుభవిస్తారని భావించేవారు. కానీ ఇతర మెంటల్ డిజార్డర్స్ ఉన్న వారు కూడా ఈ పరిస్థితిని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని గత అధ్యయనంలో తేలింది. ఒక వ్యక్తి సెన్సారీ ఇంప్రెషన్స్(ఇంద్రియ ముద్రలు).. బ్రెయిన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మ్యాచ్ కానప్పుడు ఇలా జరుగుతుందని కొన్ని అధ్యయనాలు వివరించాయి. అయితే తాజాగా ఈ ‘ఆడిటరీ హలోజినేషన్స్’ ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు రోబోటిక్ టెక్నిక్ డెవలప్ చేశారు శాస్త్రవేత్తలు.
ప్రయోగంలో భాగంగా కొంతమంది కళ్లకు గంతలు కట్టి వారి ముందున్న మీటను నొక్కమని అడిగారు శాస్త్రవేత్తలు. వారు అలా చేయగానే రోబోటిక్ హ్యాండ్ వారి వీపుపై తాకింది. అప్పుడు మెదడు తనను వెనుక టచ్ చేసింది తన సొంత చేయి అని గ్రహించింది. ఆ తర్వాత ఎక్స్‌పరిమెంట్‌లో కొంచెం చేంజెస్ చేశారు సైంటిస్టులు. ఇప్పుడు పార్టిసిపెంట్స్ మీటను నొక్కడంతో.. కాసేపయ్యాక రోబోటిక్ చేయి తగిలేలా సెట్ చేశారు. దీంతో బ్రెయిన్ అక్కడ ఎవరో ఉన్నారని భావించింది. తనను తాకింది వేరొకరని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక తర్వాత పార్టిసిపెంట్స్‌కు.. కొన్నిసార్లు తమ సొంత వాయిస్, కొన్నిసార్లు వేరొకరివి, మరికొన్ని సార్లు అసలు వాయిస్ వినిపించకుండా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆలస్యంగా రోబోటిక్ హ్యాండ్ టచ్ చేయబడిన వారు అక్కడ ఏ స్వరం లేకపోయినా.. శబ్దాన్ని వినే అవకాశం ఉందని తేలింది. మొత్తానికి హలోజినేషన్ మెకానిజమ్స్ అందరి మెదళ్లలో ఉన్నాయని ఈ అధ్యయనం నిర్ధారించింది. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది ఇతరుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉందని తెలిపింది.