BEL: బీటెక్ అర్హతతో హైదరాబాద్ బెల్ లో ఇంజినీర్ ఉద్యోగాలు.. ఇవీ డీటెయిల్స్..!

by Maddikunta Saikiran |
BEL: బీటెక్ అర్హతతో హైదరాబాద్ బెల్ లో ఇంజినీర్ ఉద్యోగాలు.. ఇవీ డీటెయిల్స్..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా హైదరాబాద్ యూనిట్(Hyd Unit)లోని తాత్కాలిక ప్రాతిపదికన 45 ప్రాజెక్ట్ ఇంజినీర్(Project Engineer) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 22 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

ప్రాజెక్ట్ ఇంజినీర్ - 45

విద్యార్హత:

బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి:

1 నవంబర్ 2024 నాటికి అభ్యర్థులు వయసు 28 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 472+GST. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ. 40,000, రెండో ఏడాది రూ. 45,000, మూడో ఏడాది రూ. 50,000, నాలుగో ఏడాది నుంచి రూ. 55,000 జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed