Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే చాన్స్.. బ్రిటన్

by vinod kumar |
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే చాన్స్.. బ్రిటన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ సంచలన విషయాన్ని వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు తమ దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఫారిన్, కామన్వెల్త్, డెవలప్‌మెంట్ ఆఫీస్ (FCDO) ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, విదేశీ పౌరులు తరచుగా సందర్శించే ప్రదేశాల్లో తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాక ఇస్లాం మతానికి విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోబోతున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది.

మైనారిటీ మతానికి చెందిన వ్యక్తులు, పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. వీటిలో ప్రధాన నగరాల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడులు ఉన్నాయని, బంగ్లాదేశ్ అధికారులు ప్రణాళికాబద్ధమైన దాడులను తిప్పికొట్టేందుకు కృషి చేస్తున్నారని, అందుకే ఆంక్షలు విధిస్తున్నారని పేర్కొంది. దేశంలో పరిస్థితి అస్థిరంగానే ఉందని, ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలు, ప్రదర్శనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగ్లాదేశ్‌కు వెళ్లే పర్యటనలకు సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీలో పలు మార్పులు చేసింది. ఎఫ్ సీడీఓ ఆదేశాలు ఉల్లంఘిస్తే ప్రయాణ బీమా చెల్లబోదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story