HYD: ట్రాన్స్ జెండర్లకు పోలీసు ఉద్యోగం.. తొలిరోజు ఎంతమంది సెలక్ట్ అయ్యారంటే?

by Gantepaka Srikanth |
HYD: ట్రాన్స్ జెండర్లకు పోలీసు ఉద్యోగం.. తొలిరోజు ఎంతమంది సెలక్ట్ అయ్యారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాన్స్ జెండర్ల(Transgenders)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక బాధ్యతలు అప్పగించింది. వారికి ఉపాధి కల్పించే దిశగా ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ విధుల్లోకి తీసుకున్నారు. తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌(Hyderabad City Commissionerate) పరిధిలో బుధవారం నియామకాలు చేపట్టారు. గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో ట్రాన్స్‌జెండర్లకు ఈవెంట్స్‌ నిర్వహించారు. రన్నింగ్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేశారు. ఈవెంట్స్‌ తర్వాత మొత్తం 44 మందిని అధికారులు సెలెక్ట్‌ చేశారు. సెలెక్ట్‌ అయిన వారిని ట్రైనింగ్‌ ఇచ్చి నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఈవెంట్స్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP Anand) స్వయంగా పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీసు కొలువు కోసం వచ్చిన ట్రాన్స్ జెండర్లతో కాసేపు సరదాగా సీపీ ముచ్చటించారు.

Advertisement

Next Story