- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Grok: సిద్ధాంతి ఎందుకు.. ఆస్క్ గ్రోక్! ఆ మూవీ ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం పెట్టిన చాట్‌బాట్

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పుడు ఏ నలుగురు కలిసినా అంతా గ్రోక్ ముచ్చటే.. ఎందుకంటే మనం ఎలాంటి ప్రశ్న వేసినా ఇట్టే సమాధానం చెప్పేస్తోంది ఈ మస్క్ చాట్‌బాట్. ఈ నేపథ్యంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్‌హుడ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ కోసం చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. చిత్ర ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దామని దర్శకుడు అడుగగా.. నితిన్ ‘ఈ రోజుల్లో సిద్ధాంతి ఎందుకు?.. జస్ట్ ఆస్క్ గ్రోక్’ అంటాడు. ఆ వెంటనే వెంకీ ముహూర్తం కోసం గ్రోక్‌లో ఇంగ్లీష్‌లో టైప్ చేయగా.. ‘అంత ఇంగ్లీష్ వద్దు గానీ.. తెలుగులో ఏడువు’ అంటూ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన వెంకీ ‘నువ్వు అడుగు అని నితిన్‌ను కోరగా ‘దాన్ని నువ్వే హ్యాండిల్ చెయ్’ అంటాడు. దీంతో ఆ మాట విన్న గ్రోక్..‘దాన్ని దీన్నీ అన్నావంటే గూబ పగులుద్ది’ అని వార్నింగ్ ఇస్తుంది.
సరే సావండి..
అనంతరం దర్శకుడు తెలుగులో అడగడంతో మార్చి 21న అని సూచిస్తుంది. మరి టైమో? అనడంతో.. ‘మీ టాలీవుడ్‌లో అనుకున్న టైమ్‌కు ఎప్పుడైనా కంటెంట్ రిలీజ్ చేశారా?’ అంటూ గ్రోక్ మరో ఝలక్ ఇస్తుంది. ఆ తర్వాత 4 గంటలకు.. అని చెప్పగా 4+5 =9.. 4 గంటల 5 నిమిషాలైతే ఓకే కాదా..? అని వెంకీ మళ్లీ ప్రశ్నిస్తాడు.. దానికి గ్రోక్ స్పందిస్తూ.. మీ టాలీవుడ్‌లో ఈ తొమ్మిది సెంటిమెంట్ గోల ఏంట్రా బాబు? సరే సావండి’ అని అంటుంది. దీంతో మొత్తంగా మార్చి 21న, సాయంత్రం 4:05 గంటలకు రాబిన్‌హుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఉంటుందని నితిన్, వెంకీ ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.