పోసానికి అస్వస్థత.. జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు

by Mahesh |
పోసానికి అస్వస్థత.. జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అనంతరం ఆయనను ఇప్పటికే పలుమార్లు పోలీసులు విచారించారు. తాజాగా మరోసారి పోసానిని ఒకరోజు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో దీంతో గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రి (GGH Hospital)లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పోసాని అస్వస్థత (Illness)గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోసాని.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని, ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్‌ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే వాటి తీవ్రత అతిగా లేకపోవడంతో.. పోసానిని సీఐడీ కార్యాలయానికి తరలించారు. కోర్టు అనుమతి ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ప్రశ్నించనున్నారు.

కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే వారిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా దూషించారు. దీంతో పోసాని చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసాని పై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి తో పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగా మొదట అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపి.. ఫిబ్రవరి 27న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. ఏపీకి తరలించారు.

Next Story

Most Viewed